తనకు చెప్పకుండా ప్రేమించిన వ్యక్తిని కూతురు పెళ్లి చేసుకుందనే కోపంతో ఓ తండ్రి కోపంతో రగిలిపోయాడు. ఆ కోపంలోనే కత్తి తీసుకొని కూతురు అత్తారింటికి వెళ్లి మరీ... అక్కడే ఆమెపై దాడి చేశాడు. కాగా.. ప్రస్తుతం సదరు యువతి... ,చావు, బతుకుల మధ్య పోరాడుతోంది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని నార్త్ పార్గాన్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నార్త్ పార్గాన్ ప్రాంతానికి చెందిన యువతి అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోడౌన్ ప్రాంతానికి చెందిన శంకర్ హల్దార్ అనే వ్యక్తిని ప్రేమించింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంతో.. మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. 

కాగా.. కూతురు తన అనుమతి లేకుండా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పట్ల సదరు యువతి తండ్రి దులాల్ మజుందార్ పగ పెంచుకున్నాడు. ఈ విషయంలో ఎప్పటి నుంచో కోపంతో ఊగిపోయితున్న దులాల్ మజుందార్... కూతురిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఇందులో భాగంగానే ఆదివారం కూతురు అత్తారింటికి వెళ్లాడు. చేతిలో పదునైన కత్తి తీసుకొని వెళ్లిన అతను... అక్కడే  అందరూ చూస్తుండగానే కత్తితో పలు మార్లు పొడిచాడు. దీంతో తీవ్రగాయాలపాలైన యువతిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. అనంతరం అక్కడి నుంచి బాసాత్ హాస్పిటల్ కి తరలిచారు. ప్రస్తుతం అక్కడే ఆమె చికిత్స పొందుతోంది. ఆమెకు దాదాపు 18కుట్లు పడ్డాయని పోలీసులు చెబుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

తన భార్యపై జరిగిన దాడిపై శంకర్ హల్దార్ స్పందించారు. తన మామగారికి చెప్పకుండా తాము పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. ఈ విషయంలో తనకు పలు మార్లు బెదిరింపులు వచ్చాయని చెప్పాడు. అయితే... అతని బెదిరింపులను తాము పెద్దగా పట్టించుకోలేదని చెప్పాడు. అతను ఇలా చేస్తాడని తాము ఊహించలేదని వివరించాడు. ఈ మేరకు  కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.