Asianet News TeluguAsianet News Telugu

భార్యపై అనుమానం.. వంటింటి కత్తితో గొంతుకోసి చంపిన కంప్యూటర్ ఇంజనీర్..!

భార్య మీద అనుమానంతో వంటింటి కత్తితో గొంతుకోసి చంపాడో కంప్యూటర్ ఇంజనీర్. ఈ దారుణం పూనేలో వెలుగు చూసింది. 

man slits wife throat with kitchen knife in Pune, arrested
Author
First Published Dec 6, 2022, 2:12 PM IST

పూనె : భార్యతో అతి దారుణంగా హతమార్చిన కేసులో ఓ కంప్యూటర్ ఇంజనీర్ (35)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫుర్సుంగిలోని ఓ ఇంట్లో కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసిన తన భార్య (31)తో రాత్రి జరిగిన గొడవలో కత్తితో పొడిచి హతమార్చానని అతను తన ఓనర్ కు చెప్పాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

హింజేవాడిలో ఐటీ కంపెనీలో పనిచేసే రాజేంద్ర భౌసాహెబ్ గైక్వాడ్ అనే వ్యక్తి తన భార్య జ్యోతిని వంటింట్లో ఉపయోగించే కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ కత్తిని ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యజమాని అందించిన సమాచారంతో గురుద్వార లోని మూడంతస్తుల భవనానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడికి వెళ్లే సరికి జ్యోతి బెడ్రూంలో రక్తపు మడుగులు పడి ఉంది. వారి ఐదు నెలల కూతురు ఏడుస్తూ కనిపించింది. 

అక్కడే ఉన్న నిందితుడు రాజేంద్రను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని అదే ఊర్లో ఉండే జ్యోతి సోదరికి అప్పగించారు. జ్యోతి మూడు రోజుల క్రితమే ఉద్యోగం మానేసింది. నాందేడ్ జిల్లా మాడగీ గ్రామానికి చెందిన రాజేంద్రకు, నాందేడ్ లోని సిడ్కో కాలనీకి చెందిన జ్యోతికి 2020, నవంబర్ 20న పెళ్లయ్యింది. ఆ తరువాత వీరిద్దరూ పుర్సుంగికి వచ్చారు. ఇద్దరూ ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఈ యేడాది జూన్ 27న పాప పుట్టింది. 

బాబోయ్.. వాషింగ్ మెషీన్ వృథానీరు ఇంటిముందుకు వస్తుందని.. మహిళను రాళ్లతో మోది హత్య...

అయితే, పాప తనకు పుట్టలేదని.. రాజేంద్ర జ్యోతి మీద అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరచూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఇప్పటికే ఈ విషయంలో వీరిద్దరికీ ఐదుసార్లు పెద్దలు రాజీ కుదిర్చారు. ఆదివారం కూడా ఆరోసారి చర్చలు జరిగాయి. గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండమని పెద్దలు వారిని ఇక్కడికి పంపించారు. మూడు రోజులు కూడా తిరగకముందే ఈ దారుణం జరిగింది. ఈ మేరకు జ్యోతి చెల్లెలు గంగాసాగర్ క్రిష్ సాగర్ తెలిపింది. అంతేకాదు తన సోదరి హత్యలో భర్త రాజేంద్రతో పాటు అతని సోదరుడి హస్తం కూడా ఉందని ఫిర్యాదు చేసింది. 

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రాజేంద్ర సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర గత ఆర్నెళ్లుగా వేధింపులు తీవ్రం చేశాడని.. జీతం మొత్తం తీసుకువచ్చి అతనికే ఇవ్వాలని సతాయించేవాడని తెలిపింది. రాజేంద్ర, అతని సోదరుడు అదనపు కట్నం కావాలని వేధించేవారని.. భర్తతో ఆమె కలిసి ఉండాలంటే రూ.50వేలు అదనంగా ఇవ్వాలని వేధించారని క్రిష్ సాగర్ తన రిపోర్టులో పేర్కొంది. 

అయితే, తన భర్త వేధింపుల మీద ఆమె ఎప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేయలేదని.. అతను మారతాడని నమ్మిందని క్రిష్ సాగర్ చెప్పుకొచ్చింది. ఉదయం 7.45ని.ల సమయంలో ఇంటి యజమాని ఫోన్ చేయడంతో తనకు విషయం తెలిసిందని... వెంటనే పరిగెత్తుకొచ్చానని తెలిపింది. పోలీసులు ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినతరువాత కుటుంబసభ్యులకు అందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios