Puttur: కర్ణాటకలో తాజాగా ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనపై వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు ఒక దుర్మార్గుడు. దక్షిణ కన్నడ జిల్లాలో తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఓ వ్యక్తి తన 18 ఏళ్ల ప్రియురాలిని గొంతు కోసి హత్య చేశాడనీ, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
Man slits girlfriend's throat in Karnataka: కర్ణాటకలో తాజాగా ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనపై వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు ఒక దుర్మార్గుడు. దక్షిణ కన్నడ జిల్లాలో తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఓ వ్యక్తి తన 18 ఏళ్ల ప్రియురాలిని గొంతు కోసి హత్య చేశాడనీ, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో 18 ఏళ్ల ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో నిందితుడు బాలికను హత్య చేశాడని పోలీసులు తెలిపారు. పుత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పుత్తూరు బస్ స్టేషన్ లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో పద్మరాజ్ అనే నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాలిక బెదిరించింది.
పుత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా పద్మరాజ్ మోటార్ సైకిల్ పై ఆమెను వెంబడించి గొంతు కోశాడు. అటుగా వెళ్తున్న వారు బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడనీ, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ దుర్గావాహిని జిల్లా కన్వీనర్ శ్వేతా అద్యపాడి మాట్లాడుతూ ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. మహిళలపై ఇలాంటి దాడులు జరగకుండా పోలీసులు చూడాలన్నారు. పుత్తూరులో మహిళా పోలీస్ స్టేషన్‌కు కొన్ని మీటర్ల దూరంలో 18 ఏళ్ల బాలిక హత్యకు గురికావడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.
