ఓ యువకుడు ఎయిర్ పార్కింగ్ స్లాట్ లోకి దూరి నానా బీభత్సం సృష్టించాడు. మరికాసేపట్లో టేకాఫ్ అవుతుందునుకున్న హెలికాప్టర్ ని పూర్తిగా నాశనం చేశాడు. ఈ సంఘటన భోపాల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భోపాల్ కి చెందిన ఓ 20ఏళ్ల యువకుడు భోపాల్ ఎయిర్ పోర్టులోకి ప్రవేశించాడు. అనంతరం మరికాసేపట్లో టేకాఫ్ కావాల్సిన  హెలికాప్టర్ ముందు భాగాన్ని పాడుచేశాడు.  హెలికాప్టర్ నోస్ కోన్ ని నాశనం చేశాడు. అనంతరం స్పైజ్ జెట్ ప్లేన్ ఎదురుగా కూర్చొని దాని  రెండు ఇంజిన్లు పాడుచేశాడు.

Also Read సీఏఏని వ్యతిరేకిస్తూ నిరసనలు... స్కూటీపై వచ్చి కాల్పులు...

దీంతో అతనిని సెంట్రల్ ఇండస్ట్రీయిల్ సెక్యురిటీ ఫోర్స్ పట్టుకోగా... అనంతరం ఆ యుకుడిని పోలీసులకు అప్పగించారు. ఓ వ్యక్తి అనుమతి లేకుండా ఎయిర్ పోర్టులోకి ప్రవేశించాడని తమకు సమాచారం అందిందని.. ఆ సమాచారం మేరకు అక్కడకు చేరుకొని అతనిని అరెస్టు చేసినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. 

ఆ యువకుడు చేసిన నిర్వాకంతో... 46మంది ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఇంజిన్లు పాడు చేయడంతో... గంట ఆలస్యంగా విమానం బయలుదేరిందని అధికారులు చెప్పారు.