బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు  చేసుకుంది. ఆసుపత్రికి వచ్చిన  వ్యక్తిపై దుండగుడు కాల్పులకు దిగాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడికి వైద్యులు చికిత్స అందించారు.


పాట్నా: బీహర్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో ఉన్న వ్యక్తిపై దుండగుడు తుపాకీతో కాల్పులకు దిగాడు.ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాధితుడికి వెంటనే చికిత్స అందించారు. బాధితుడి శరీరంలో నుండి బుల్లెట్ ను వెలికి తీశారు.

రాష్ట్రంలోని అర్రా నగరంలో గురువారంనాడు సాయంత్రం ఆసుపత్రిలో ఉన్న వ్యక్తిపై దుండగుడు కాల్పులకు దిగాడు. కాల్పులకు దిగిన వ్యక్తిని పట్టుకొనేందుకు పక్కనే ఉన్న వ్యక్తి ప్రయత్నించాడు. దుండగుడు తప్పించుకొంటూ కాల్పులు జరిపాడు. ఆసుపత్రిలోని సీసీటీవీ పుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

బాధితుడు తన భార్యను ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి శరీరంలో నుండి బుల్లెట్లను బయటకు తీశారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని ధరహారా టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆసుపత్రిలోని రోగులు భయాందోళనలకు గురయ్యారు.