తిరువూరు: ఓ 37 ఏళ్ల వ్యక్తి ఆరు నెలలుగా తన మైనర్ కూతురిపై లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నాడు. తమిలనాడులోని తిరువూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళా పోలీసు స్టేషన్ (ఏడబ్ల్యుపిఎస్) సిబ్బంది అతన్ని అరెస్టు చేశారు. 

ఏడబ్ల్యుపిఎస్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పుష్పవల్లి కేసును దర్యాప్తు చేస్తున్నారు. వ్యవసాయ కూలీ అయిన అతను గంజాయికి అలవాటు పడ్డాడని ఆమె చెప్పారు. తాను ఇంట్లో లేని సమయంలో తన భర్త తన కూతురి ప్రైవేట్ పార్ట్స్ ను తాకుతూ వేధిస్తున్నాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. 

విషయాన్ని ఎవరికైనా చెప్తే తీవ్రమైన పరిణామాలుంటాయని తండ్రి తనను బెదిరించాడని బాలిక పోలీసులకు చెప్పింది. తన ప్రాణాలు తీస్తాడనే భయంతో మౌనంగా ఉండిపోయానని చెప్పింది. తన భార్య ఇంట్లో లేని సమయంలో ఇంటి తలుపులు వేసి కూతురిపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు. 

లోపలి నుంచి తన కూతురు తలుపులు బాదుతున్న చప్పుడు వినిపించి మహిళ హుటాహుటిన వెళ్లి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అతనిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.