క్వారంటైన్ సెంటర్లో మహిళపై యువకుడు లైంగిక దాడి చేసిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. క్వారంటైన్ కేంద్రంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో క్వారంటైన్ కేంద్రాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాజధాని బెంగళూరు పరిధిలోని ఒక క్వారంటైన్ కేంద్రంలో ఈ సంఘటన చోటుకి చేసుకుంది. నిందితుడు శంకర్ తొలుత బాత్రూం వద్ద ఒక మహిళను చూసి ఆమెతో అమర్యాదగా, అసభ్యంగా ప్రవర్తించాడు. అతడిని నెట్టివేసి ఆ మహిళా అక్కడి నుండి పారిపోతుండగా... ఆ మహిళను వెంబడించాడు శంకర్. 

అలా ఆ మహిళను వెంబడిస్తుండగా.... అదే క్వారంటైన్ కేంద్రంలో వేరే రూంలో నిద్రిస్తున్న మరో యువతిని చూసాడు శంకర్. వెంటనే ఆ రూంలోకి ప్రవేశించి ఆ మహిళపై లైంగిక దాడి చేయబోయాడు. ఇంతలోనే అదే రూంలో ఉన్న ఇతర మహిళలు గట్టిగ కేకలు వేయడంతో.... అక్కడ ఉన్న  అతడిని పట్టుకున్నారు. 

నిందితుడు శంకర్ ను పట్టుకొని బంధించి అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. నిందితుడు శంకర్ పథ రికార్డులను పరిశీలిస్తున్నారు. 

ఇకపోతే... ఆ గదిలో ఉన్న బాధితురాలి స్వస్థలం ముంబై గా తెలియవస్తుంది. ఆమె ఇటీవలే బెంగళూరు వచ్చిందని, మహారాష్ట్ర నుంచి వచ్చిన వారికి కంపల్సరీ క్వారంటైన్ నిబంధన ఉండడంతో... ఆమహిళా క్వారంటైన్ కేంద్రంలో ఉన్నట్టుగా తెలియవస్తుంది.