తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా పల్లడంలో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసి ప్రియురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశాడు. అంతటితో ఆగకుండా.. పెట్రోల్ పోసి..నిప్పంటించాడు. చికిత్స పొందుతూ ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.  

దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. కఠిన చట్టాలు తీసుకవచ్చిన కామాంధుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏదోక చోట దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన వెలుగు చూసింది. తిరుపూర్ జిల్లాలోని పల్లడం సమీపంలోని అడవి ప్రాంతంలో ఓ యువతి బట్టల్లేకుండా శరీరం మొత్తం కాలిపోయి.. సాయం కోసం కేకలు వేస్తూ పరుగు తీస్తూ బయటకు వచ్చింది. స్థానికులు ఆ యువతిని రక్షించి.. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ చిక్సిత పొందుతూ బుధవారం మరణించింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన పూజ అనే యువతి. ఆమె తన తల్లిదండ్రులు మరణించిన తరువాత.. తమిళనాడులోని తిరుప్పూర్‌లో బంధువుల వద్ద నివసిస్తూ.. ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తుంది. ఈ క్రమంలో అనే ఫ్యాక్టరీలో పని చేస్తున్న లోకేష్ అనే 22 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్ని రోజుల తరువాత ప్రేమగా మారింది. గత ఏడాది కాలంగా.. ఇద్దరూ ఇష్టానుసారంగా తిరిగారు.

ఈ క్రమంలో ఆ యువతి లోకేష్ ను పూర్తిగా నమ్మింది. తాననే సర్వస్వంగా భావించింది. కానీ.. లోకేష్ మాత్రం ప్రేమ ముసుగులో పూజను శారీరకంగా వాడుకున్నాడు. ఆ యువతిని పలుమార్లు రహస్య ప్రాంతానికి వెళ్లి .. తన లైంగిక వాంఛను తీర్చుకున్నారు. కానీ.. పూజ పెళ్లి ప్రస్తవ తీసుకవస్తే.. మాత్రం ఏదోక సాకు చెప్పుతూ.. ఆ అంశాన్ని దాటవేస్తూ వచ్చే వాడు. కానీ.. పూజ మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దీంతో తాను ఏదో ఒకటి చేసి.. పూజను విడిపించుకోవాలని లోకేష్ స్కెచ్ వేశాడు. 

ఈ తరుణంలో లోకేష్ తనప్రియురాలు పూజను బుధవారం నిర్జన అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఎప్పటిలాగే అతడు తన కోరిక తీర్చుకున్నాడు. ఆ సందర్భంలో లోకేష్. పూజా ఇద్దరూ ఒంటరిగా అడవిలో కుర్చుని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో లోకేష్‌ను పెళ్లి చేసుకోవాలని పూజా ఒత్తిడి చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన లోకేష్‌.. ఆ యువతి తలపై బండరాయితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా.. అపస్మారక స్థితిలో పడివున్న పూజా మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడి నుంచి పరారైనాడు. కాలిపోతున్న యువతిని గమనించిన పాదచారులు, స్థానికులు ఆమెను రక్షించేందుకు పరుగులు తీశారు. వారు పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై పారిపోయేందుకు ప్రయత్నించిన లోకేష్ ను పట్టుకున్నారు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం పూజను ఆసుపత్రికి తరలించి, లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతికి తిరుప్పూర్ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. తదుపరి మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పూజ గురువారం ఉదయం మృతి చెందింది.

పోలీసులు లోకేష్‌పై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది. పోలీసుల విచారణలో లోకేష్ పలు విషయాలను వెల్లడించారు. పెళ్లి చేసుకోవాలని తన మీద ఒత్తిడి చెయ్యడంతో పక్కాప్లాన్ తో చంపేశానని లోకేష్ తన నేరాన్ని అంగీకరించాడని పల్లడం పోలీసు అధికారులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలిని సజీవదహనం చెయ్యడం తిరుప్పూరులో కలకలం రేపింది.