Asianet News TeluguAsianet News Telugu

7 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు..

ప్రత్యేక న్యాయమూర్తి గోవింద్ మోహన్.. నిందితుడు రోహిత్ చౌహాన్ (38)కి జీవిత ఖైదు, రూ. 1 లక్ష జరిమానా విధించారు.

Man Sentenced To Life Imprisonment For Raping 7-Year-Old Girl in UttarPradesh - bsb
Author
First Published Jan 26, 2023, 10:21 AM IST

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలోని ప్రత్యేక కోర్టు ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జీవిత ఖైదు విధించింది.
ప్రత్యేక న్యాయమూర్తి గోవింద్ మోహన్ బుధవారం రోహిత్ చౌహాన్ (38) అనే నిందితుడికి జీవిత ఖైదురూ. 1 లక్ష జరిమానా విధించినట్లు న్యాయవాది త్రిభువన్ నాథ్ యాదవ్ తెలిపారు.

లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద ప్రత్యేక కోర్టు జనవరి 24న చౌహాన్‌ను దోషిగా నిర్ధారించింది. గతేడాది మేలో బాలికపై అత్యాచారం జరిగింది. నాగ్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

నేటినుంచి ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు..

ఇదిలా ఉండగా, ఇలాంటి తీర్పే ఆంధ్రప్రదేశ్ లోని ఓ కోర్టు వెలువరించింది. ఓ కామాంధుడికి ఒంగోలు రెండవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఉరిశిక్ష విధించారు. కుమార్తె వరసయ్యే ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆ ఉన్మాది…ఆ చిన్నారిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసు మీద విచారణ జరిపి తీర్పునిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి (ఇన్ ఛార్జి) ఎం.ఎ.సోమశేఖర్ ఆ కామాంధుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. దీనికి సంబంధించి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కెవి రామేశ్వర్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. దూదేకుల సిద్దయ్య అనే నిందితుడు గిద్దలూరు మండలం  అబ్బవరానికి చెందిన వ్యక్తి. అతను మద్యానికి బానిస అయ్యాడు. మద్యం మత్తులో అతికిరాతకంగా వ్యవహరించేవాడు. 

దీంతో అతనితో పడలేక భార్య విడిచి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో 2021 జులై 8న సిద్దయ్య ఈ దారుణానికి ఒడిగట్టాడు. సిద్దయ్య ఇంటిదగ్గర ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారిని సిద్దయ్య దగ్గరికి రమ్మని పిలిచాడు. అలా వచ్చిన చిన్నారిని ఇంట్లోకి తీసుకువెళ్లి ఆమె మీద అత్యంత పాశవికంగా అత్యాచారానికి ప్రయత్నించాడు. అనుకోని ఈ పరిణామానికి చిన్నారి కేకలు వేసింది. దీంతో తాను పట్టు పడతానని భయపడిన సిద్దయ్య బాలిక ముఖాన్ని మంచం కోడుకేసి గట్టిగా కొట్టాడు.

ఈ దెబ్బలకు చిన్నారి స్పృహ కోల్పోయింది. స్పృహలో లేని ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటికి ఆ చిన్నారి చనిపోయింది. దీంతో తాను పట్టు పడకుండా ఉండాలంటే  మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. దీనికోసం చిన్నారి శవాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టాడు. ఆ తర్వాత  ఆ మూటను సైకిల్ మీద పెట్టుకొని ఊరి చివర్లకు  వెళ్ళాడు. అక్కడ ఉన్న చిల్లచెట్లలో చిన్నారి మృతదేహాన్ని పడేసి.. అక్కడి నుంచి పారిపోయాడు.

అనుమానాస్పదంగా మూట కనిపిస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు చిన్నారి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఊరి శివారులలో కనిపించిన మూట ..చిన్నారి మృతదేహంగా గుర్తించి.. ఆ దిశగా దర్యాప్తు చేశారు. చివరికి నిందితుడైన సిద్ధయ్యను అరెస్టు చేశారు. కేసు విచారణలో న్యాయమూర్తి సాక్షాదారులను పరిశీలించారు. నేరం రుజువు అయింది కాబట్టి నిందితుడికి చనిపోయేంతవరకు ఉరి అని మరణశిక్ష విధిస్తూ బుధవారం తీర్పును చెప్పారు.

బాధిత కుటుంబమైన బాలిక తల్లిదండ్రులకు రూ.10లక్షలు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేశారు. ఈ తీర్పు వెలువడిన తర్వాత ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మల్లికా గారికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేసును సాల్వ్ చేయడంలో, విచారణలో ప్రతిభ కనబరిచారని అప్పటి దిశా స్టేషన్ డిఎస్పి ధనుంజయుడు, సిఐ ఎండి ఫిరోజ్, కోర్టు లైజన్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. వీరికి ప్రశంసా పత్రాలు, రివార్డులు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి పక్కా సాక్షాధారాలతో ఛార్జ్ షీట్ ను పోలీసులు దాఖలు చేశారని..  దీనివల్లే 18 నెలల్లోనే దోషికి శిక్ష పడిందని  చెప్పుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios