ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే..తిరువళ్లూరు జిల్లా ముత్తాపుదుపేట గ్రామానికి చెందిన మోనస్ ప్రసన్న దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

ఈ నేపథ్యంలో 2017 జనవరి 23న వీరి కుమార్తె ఇంటి దగ్గర ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన అంటోనీ బాలికను సమీపంలోని పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ క్రమంలో ఏడుస్తూ ఇంటికి వచ్చిన బాలిక జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు సదరు కామాంధుడికి ఆవడి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడు ఆంటోనీని అరెస్ట్ చేశారు.

తిరువళ్లూరు కోర్టు రెండేళ్ల సుధీర్ఘ విచారణలో నిందితుడు బాలికపై అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో ఆంటోనీకి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు జైలు శిక్షను అనుభవించాలని తీర్పును వెలువరించారు.  అనంతరం పోలీసులు ఆంటోనీని పుళల్ జైలుకు తరలించారు.