Asianet News TeluguAsianet News Telugu

ఐదేళ్ల బాలుడిపై లైంగికదాడి, హత్య.. నిందితుడికి మరణశిక్ష..

బెంగళూరులోని ఓ కోర్టు మైనర్ పై హత్యాచార కేసులో నిందితుడికి మరణశిక్ష విధించింది. ఐదేళ్ల బాలుడి మీద లైంగికదాడి చేసి హత్య చేశాడు నిందితుడు. 

man sentenced death in rape and murder a 5 years old boy in bengalore
Author
First Published Nov 19, 2022, 1:01 PM IST

బెంగళూరు : ఐదేళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడికి పాల్పడి,  హత్య చేశాడో దుర్మార్గుడు. మూర్తి అనే ఆ నిందితుడికి బెంగళూరులోని ఒకటో ఫాస్ట్ ట్రాక్ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది. మృతుని కుటుంబ సభ్యులకు 5లక్షల రూపాయల పరిహారాన్ని ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని బెంగళూరు న్యాయ సేవల ప్రాధికార సంస్థకు న్యాయమూర్తి కె.ఎన్.రూప సూచించారు. నిందితుడికి రూ.50వేల  జరిమానా విధించారు. 

మైనర్లపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షలు విధించాలన్న చట్టం వచ్చి పదేళ్లు అవుతున్నా.. ఇప్పటి వరకు అలా జరగలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. కఠిన శిక్షలతోనే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. నిందితుడు 2015 సెప్టెంబర్ 12న లైంగికత దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాలుడు కేకలు వేయడంతో తలపై బండరాయితో మోది హత్య చేశాడు.

ఇదిలా ఉండగా, ఇలాంటి కేసులోనే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తికి అక్టోబర్ 1న 30యేళ్ల జైలు శిక్ష పడింది. కామంతో  కళ్ళు  మూసుకుపోయి ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, మరో ఏడేళ్ల బాబుపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం రెండు కేసుల్లో కలిపి 30 ఏళ్ల కఠిన కారాగారశిక్ష రూ.13.000 జరిమానా విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం.. నిందితుడు సుశీల్ కుమార్ సింగ్ (35)  రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని కాటేదాన్ లో ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీకి అనుబంధం నివాస గృహ సముదాయంలో ఉండేవాడు.  

దారుణం.. విరిగిపడ్డ మంచు చరియలు.. ముగ్గురు జవాన్లు మృతి

అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వీరు మాత్రం బీహార్లోని సొంతూరులో ఉంటున్నారు. ఒంటరిగా ఉన్న అతను తాగుడు, ఇతర చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఈ గ్రామంలో 2019 మే 4న వంటరిగా కనిపించిన చిన్నారి (7)ని సమోసా ఇప్పిస్తానని ఆశ చూపి బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపం లోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి పరారయ్యాడు. మైలార్ దేవులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సమగ్ర దర్యాప్తు తరువాత కోర్టులో నిందితుడిపై పోక్సో చట్టం కింద అభియోగ పత్రాలు దాఖలు చేశారు. 

కేసు విచారించిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి ఆర్ తిరుపతి నిందితుడికి 20 ఏళ్ల జైలు..రూ.10వేల  జరిమానా విధించారు.  దీంతోపాటు బాధిత చిన్నారికి రూ. 5 లక్షల నష్టపరిహారం మంజూరు చేయాలంటూ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు సిఫార్సు చేశారు. ఈ ఘటనకు ముందు  2019 ఏప్రిల్ 29న నిందితుడు సుశీల్ కుమార్ సింగ్ ఓ బాలుడి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాజేంద్రనగర్ మండలం లో ఓ మైదానంలో ఆడుకుంటున్న బాలుడు (7)కి  రేగి పళ్ళు కొని ఇస్తానని ఆశ చూపి.. సమీపంలోని స్మశాన వాటికకు తీసుకువెళ్లి అమానుషంగా లైంగికదాడి చేశాడు. 

మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు.  ఆ తర్వాత సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసులు  సాంకేతిక,  వైద్య ఆధారాలతో కూడిన అభియోగ పత్రాన్ని కోర్టులో దాఖలు చేశారు.  ఈ కేసులో న్యాయమూర్తి తిరుపతి నిందితుడికి  పదేళ్ల జైలు రూ. 3000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios