న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైలు పట్టాలపై లభించిన మొండెనికి సంబంధించిన వ్యక్తి తల కర్ణాటక రాష్ట్రంలో లభ్యమైంది.ఈ నెల 3వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బెతుల్ రైల్వేస్టేషన్ లో పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి  మొండెం లభించింది.

అయితే తలతో పాటు ఇతర బాగాలు కన్పించలేదు. దీంతో పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకొన్నారు. మిగిలిన శరీరబాగాల కోసం వెతికారు.రైలు ఇంజన్ కు చిక్కుకొన్న తలను  బెంగుళూరు రైల్వేస్టేషన్ లో రైల్వే సిబ్బంది గుర్తించారు.ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమిచ్చారు.

తలను ఫోటో తీశారు. ఈ రైలు ప్రయానించిన మార్గంలోని పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బతుల్ కు చెందిన 28 ఏళ్ల రవి మర్కామ్ కు చెందినవి తేల్చారు పోలీసులు. 

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు అతడి తల మీదుగా పోవడంతో అతను మరణించినట్టుగా పోలీసులు ధృవీకరించారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా, లేక హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.