ప్రాణాలను పణంగా పెట్టి.. నీటి ప్రవాహంలో చిక్కుకున్న కుక్కను కాపాడాడు.. వీడియో వైరల్
ప్రమాదంలో ఉన్న కుక్కను రక్షించడానికి ఓ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి.. దానిని రక్షించడంలో విజయం సాధిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగవైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 141.6K వ్యూస్,7 వేలకు పైగా లైకులు వచ్చాయి. మరోవైపు కామెంట్ల వర్షం కురుపిస్తున్నారు నెటిజన్లు.
ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు తారసపడుతూనే ఉంటాయి. ఇందులో కొన్నివీడియోలు వినోదాన్ని పంచుతే.. మరికొన్ని హృదయాన్ని తాకుతాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారుతాయి. తాజాగా ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి డ్యామ్‌లో చిక్కుకున్న కుక్కను రక్షించాడు. వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిని ప్రసంశలతో ముంచెత్తుతున్నారు.
ఈ వీడియోను 'జిందగీ గుల్జార్ హై' అనే ట్విట్టర్ పేజీలో షేర్ చేస్తూ, 'మీ డిగ్రీ కేవలం కాగితం ముక్క మాత్రమే, మీ నిజమైన విద్య మీ ప్రవర్తనలో ప్రతిబింబిస్తుంది' అనే క్యాప్షన్‌లో వ్రాయబడింది. ఈ వీడియోలో ఒక సెక్యూరిటీ గార్డు, కొంతమంది వ్యక్తులు తమ చేతుల్లో తాడుతో కనిపిస్తారు. ఓ వ్యక్తి తాడు సహాయంతో ఉద్రుతంగా పొందిపోర్లుతున్న కాలువలోకి దిగుతాడు. ఆ తరువాత తన ప్రాణాలను పణంగా పెట్టి .. వరదల్లో చిక్కుకున్న కుక్కను రక్షించే ప్రయత్నం చూడవచ్చు. ఇది చూసి యూజర్లు అవాక్కయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ ఈ వీడియోకు ఒక లక్షా 41 వేలకు పైగా వ్యూస్ ఉండగా..7 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.
అదే సమయంలో ఈ వీడియోను చూసి నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. 'సోదరా నీ ధైర్యానికి నావందనం. అదే విధంగా మీరందరూ మూగ జంతువులకు సేవ చేస్తూ ఉండండి. అని పేర్కొన్నారు. మరొకరు నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఒకరి ప్రాణాన్ని రక్షించడం ప్రపంచంలోనే అతిపెద్ద మతం. మీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అని రాసుకోచ్చారు.