ఇంటర్వ్యూ అని చెప్పి నమ్మించి హోటల్ గదికి పిలచాడు. నిజంగా ఇంటర్వ్యూ అని భావించి ఆ యువతి అక్కడికి వెళ్లింది. కానీ.. యువతిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇవ్వకపోగా... ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ యువతికి ఉద్యోగరీత్యా ముంబయి నగరానికి వచ్చింది. ఓ చిన్న కంపెనీలో ఆమె ప్రైవేటు ఉద్యోగినిగా కొన్ని సంవత్సరాలపాటు పనిచేసింది. తర్వాత ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి  తిరిగి స్వస్థలానికి వెళ్లింది. మళ్లీ గతేడాది ఏప్రిల్ లో ముంబయి వచ్చి... జాబ్ కోసం వెతుకులాట మొదలుపెట్టింది.

ఆ సమయంలో ఆమెకు సాహిల్ సింగ్ అరారో అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అతను ఢిల్లీకి చెందిన వ్యక్తి కాగా... ముంబయిలో ఉద్యోగం చేస్తున్నాడు. సదరు యువతికి ఫోన్ చేసి... ఓ బ్యాంక్ లో హెచ్ఆర్ పోస్టు ఖాళీగా ఉందని... ఇంటర్వ్యూకి రావాల్సిందిగా చెప్పాడు. ముంబయిలోని జూహు బీచ్ లో ఇంటర్వ్యూలు జరుగుతున్నట్లు చెప్పాడు.

ఆ ఫోన్ కాల్ నిజమని భావించిన యువతి ఇంటర్వ్యూకి అక్కడకు వెళ్లింది. రూ.30వేలు జీతం ఇస్తానని నమ్మించాడు. అయితే... అక్కడ అతను ఇంటర్వ్యూ చేయకపోగా.... ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె సహాయం కోసం అరవగా... చంపేస్తానని బెదిరించడం గమనార్హం.

తర్వాతి రోజు ఉదయం యువతిని హోటల్ గది నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చాడు. ఈ విషయం పోలీసులకు చెబితే... ఈ వీడియోని ఆమె తండ్రికి పంపుతానని బెదిరించాడు. అతని బెదిరింపులకు భయపడని యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు.