వింటుంటేనే అసహ్యం పుట్టించే అతి దారుణమైన, హేయమైన ఘటన మైసూర్ లో జరిగింది. సభ్యసమాజం సిగ్గుతో తల దించుకునేలా వ్యవహరించాడో మానవ మృగం. వాడి కామానికి వీధి కుక్కను బలి చేశాడు.

కర్నాటక లోని మైసూరులో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ యువకుడు వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడగా  ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెడితే...

మైసూర్ లోని గోకులం థార్డ్ స్టేజ్ లో నివాసం ఉండే సోమశేఖర్ (26) కామంతో కళ్లు మూసుకుపోయి, ఉచ్ఛనీచాలు మరిచి ఈ నెల 11న రాత్రి సమయంలో వీధి చివరున్న సందులో చాటుగా వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన కొందరు యువకుల వీడియో తీసి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వ్యాప్తి చేశారు.

దీంతో పీపుల్ ఫర్ అనిమల్స్ (పీఎఫ్ఎ) అనే స్వచ్ఛంద సంస్థ వీవీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంతువులపై లైంగిక దాడి జరిపాడన్న అభియోగాలతో కేసు నమోదు చేసి నిందితున్ని సోమవారం అరెస్టు చేశారు. దారుణానికి బలైన వీధి కుక్కను గుర్తించి వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు.