కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కామాంధుడయ్యాడు. మూడేళ్ల కన్నకూతురుపై పైశాచికంగా వ్యవహరించాడు.  భార్య ఇంట్లో లేని సమయంలో కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన గుడ్ గావ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  గుడ్ గావ్ కి చెందిన ఓ వ్యక్తి కి భార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు.  గత నెల 28వ తేదీ రాత్రి... భార్య, భర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో.. అలిగిన భార్య.. సంవత్సరం వయసుగల చిన్న కుమార్తెను తీసుకొని.. తన బంధువుల ఇంటికి వెళ్లింది. మూడేళ్ల పెద్ద కుమార్తెను ఇంట్లోనే వదలి వెళ్లిపోయింది.

తర్వాతి రోజు ఉదయం కోపం తగ్గిన తర్వాత ఇంటికి వచ్చి చూడగా.. తన మూడేళ్ల కుమార్తె రక్తం మడుగులో పడి ఉంది. ఇంట్లో భర్త కూడా కనపించలేదు. అనుమానం వచ్చిన మహిళ.. తన కుమార్తెను ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు గుర్తించారు.

వెంటనే.. మహిళ పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. పరారీలో ఉన్న ఆమె భర్తను పట్టుకొని అరెస్టు చేశారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.