మనుషుల్లో శాడిజం రోజు రోజుకీ పెరుగిపోతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. పాపం.. ఓ మూగ జీవి పట్ల కొందరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు.  ఓ పాముకి  వాడేసిన కండోమ్ ని బలవంతంగా తగిలించి వదిలేశారు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాము తలకు ఓ ఉపయోగించిన కండోమ్‌ను తొడిగి వెళ్లిపోయారు. దీంతో ఆ పాము నానా అవస్థలు పడుతూఉంది. తిండి తినలేక, నీరు తాగలేక తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఎన్ని రోజుల నుంచి ఈ పాము ఇలా అవస్థలు పడుతుందేమో కానీ.. గత వారం కిందట ముంబై కందివాల్(తూర్పు) ప్రాంతంలో కొందరికి కనిపించింది. 

దీని దుస్థితి చూసిన వారు వెంటనే దగ్గరలోని వెటర్నరీ అధికారి వద్దకు తీసుకెళ్లారు. అయితే ఈ పని సాధారణ వ్యక్తులు చేయలేరని, ఎవరో నిపుణుడైన పాములు పట్టే వ్యక్తే చేసి ఉంటాడని వారు చెబుతున్నారు. ఎందుకంటే చెక్కర్డ్ కీల్‌బ్యాక్ అనే ఈ పాములో విషం ఉంటుందని, దీనిని పట్టుకోవడం అందరికీ సాధ్యం కాదని వారంటున్నారు.

కాగా.. దాని తలకు ఉన్న కండోమ్ ని తొలగించడంతో.. పాము ఊపీరిపీల్చుకుంది. అనంతరం ఆ పామును సురక్షితంగా అడవిలో వదిలేసినట్లు అధికారులు తెలిపారు.