Asianet News TeluguAsianet News Telugu

భార్య మీదే పోస్టర్లేసిన భర్త... అవసరమైతే సంప్రదించండి అంటూ ఫోన్ నెంబర్లు.. !

అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్య మీదే పోస్టర్లు వేశాడో ప్రబుద్ధుడు. అంతేకాదు ఆమె ఫోన్ నెం. కూడా పెట్టి అవసరమైన వాళ్లు కాల్ చేయచ్చు అని ప్రింట్ చేశాడు. ఈ పోస్టర్లను నగరమంతా వేయడమే కాకుండా, అత్తా, మరదలి ఫొటోలో కూడా ఇలాగే వేస్తానని బెదిరించడం కొసమెరుపు.

man puts posters of his wife with phone numbers due to doubt in Maharashtra - bsb
Author
Hyderabad, First Published Mar 16, 2021, 10:46 AM IST

అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్య మీదే పోస్టర్లు వేశాడో ప్రబుద్ధుడు. అంతేకాదు ఆమె ఫోన్ నెం. కూడా పెట్టి అవసరమైన వాళ్లు కాల్ చేయచ్చు అని ప్రింట్ చేశాడు. ఈ పోస్టర్లను నగరమంతా వేయడమే కాకుండా, అత్తా, మరదలి ఫొటోలో కూడా ఇలాగే వేస్తానని బెదిరించడం కొసమెరుపు.

దిగజారిన మానవసంబంధాలకు, విలువల పతనానికి నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఘటన మహారాష్ట్రలోని చిఖాలి తాలూకా బుల్దానాలో జరిగింది. సొంత భార్యమీదే పోస్టర్లంటించిన నిందితుడి పేరు సమాధన్ నికల్జే.  ఈ దారుణ ఘటనకు కారణం అనుమానమేనని, భార్య విడాకులు ఇవ్వమంటే ఇవ్వకపోవడంతోనే ఇంతటి నీచానికి దిగజారాడని తేలింది. ఇతని మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెడితే... గతేడాది జూన్ 30న మహారాష్ట్ర అంచార్వాడికి చెందిన ఓ అమ్మాయిని నిందితుడు సమాధన్ వివాహం చేసుకున్నాడు. కానీ అతనికి భార్య మీద అనుమానం. దీంతో నిత్యం అనుమానంతో శారీరక, మానసిక వేధింపులకు గురి చేసేవాడు. వీటిని తట్టుకోలేక గత దీపావళికి పుట్టింటికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. 

అసలే అనుమానంతో రగిలిపోతున్న సమాధన్ భార్య తిరిగి రాకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. దీంతో భార్య ఫోటోతో పోస్టర్ తయారు చేసి, బహిరంగ ప్రదేశాల్లో అతికించాడు. అంతేకాదు ‘అవసరమైనే సంప్రదించండి’ అంటూ కొన్ని ఫోన్ నెంబర్లు కూడా యాడ్ చేశాడు. 

ఈ పోస్టర్లను మహిళ సోదరుడు చూశాడు. ఇదేంటి అంటూ సమాధన్ ను ప్రశ్నించాడు. దీనికి సమాధన్ స్పందిస్తూ ఆమె విడాకులు ఇచ్చే వరకు ఇదే తంతు కొనసాగిస్తానని బెదిరించాడు. అంతేకాదు ఇప్పటివరకు భార్య పోస్టర్లు మాత్రమే వేశానని, విడాకులు ఇవ్వకపోతే ఇక ముందు భార్య సోదరి, తల్లి ఫోటోలు కూడా వేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.  

దీంతో మహిళ సోదరుడి ఫిర్యాదుతో అంధేర పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యను ఇలా వీధికెక్కించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడికి కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios