ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కడుపుతో ఉందని కూడా చూడకుండా కదిలే రైలు నుంచి కిందకు తోసేశాడు. ఈ దారుణ సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. కాగా... ఆ గర్భిణీ స్వల్పగాయాలతో బయటడింది. 

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి... ముంబయికి చెందిన సాగర్ అనే వ్యక్తికి పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. భార్యను వదిలేసి రాణి(20) అనే యువతితో  సాగర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కాగా... ఈ విషయం సాగర్  భార్యకు తెలియడంతో....  భర్తను వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తనను వదిలేసి వెళ్లడంతో.. సాగర్ రాణి ని పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి చేసుకునే సమయానికే రాణి గర్భిణి. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి. అయితే... భార్యకు విడాకులు ఇవ్వకుండా తనను పెళ్లి చేసుకున్నాడని... తరచూ గొడవలు జరుగుతన్నాయని.. గర్భిణీ తన కడుపు తీయించేసుకోవాలని అనుకుంది.  ఇదే విషయంపై సాగర్, రాణిల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం వీరిద్దరూ రైలులో వెళ్తున్నారు.

ఆ సమయంలోనూ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. రైలు డోర్ దగ్గర నిలబడి కడుపు తీయించుకుంటానని రాణి అనడంతో... కోపంతో సాగర్ ఆమె చెంప మీద కొట్టాడు. అనంతరం రైలు లో నుంచి తోసేశాడు.  అయితే... ఆ సమయంలో రైలు నెమ్మదిగా వెళ్తుండటంతో... ఆమె స్వల్పగాయాలతో బయటపడింది. రాణి కాళ్లకు , కుడి చేతికి, ఎడమ కన్నుకు గాయాలయ్యాయి. గమనించిన రైల్వే అధికారులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా... రాణి ప్రస్తుతం తన తల్లిదగ్గర ఉంటోంది. అయితే.. రాణితో తన భర్త విడిపోయాడు అని తెలుసుకున్న సాగర్ మొదటి భార్య... మళ్లీ భర్త కోసం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే... అతను ఇంట్లో లేకపోవడంతో కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాణిని తోసేసిన తర్వాత సాగర్ పరారయ్యాడని పోలీసులు చెబుతున్నారు. 

అతని మీద హత్యాయత్నం కేసు నమోదు చేశామని.. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అయితే... సాగర్ మొదటి భార్య మాత్రం కనీసం అతని ఫోటో కూడా పోలీసులకు ఇవ్వడం లేదని.. దర్యాప్తుకి సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పారు.