ఓ మహిళకు వివాహమైన తర్వాత కొన్ని కారణాలతో భర్తతో విడిపోయింది. భర్త దూరమై భాధలో ఉన్న ఆమెకు మరో వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని తోడు ఆమెకు ఊరట కలిగించింది. దీంతో వారి పరిచయం ప్రేమగా... ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి వారిద్దరూ లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉంటున్నారు. అయితే.... ఆ  వివాహితపై ఉన్నట్లుండి  ప్రియుడు వేడి వేడి నూనె పోశాడు. దీంతో...ఆమె తీవ్రగాయాలపాలై ఆస్పత్రి పాలయ్యింది. ఈ సంఘగటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... మహారాష్ట్రకు చెందిన ఓ మహిళకు వివాహమవ్వగా... ఆమెను భర్త వదిలేశాడు. దీంతో అప్పటి నుంచి ఒంటరిగా నివసిస్తోంది. ఆ క్రమంలో ఆమెకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. దీంతో... అతనితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే... రిలేషన్ లోకి వెళ్లిన నాటి నుంచి వీరిద్దరూ తరచూ గొడవపడేవాడు.

ప్రియుడు రోజూ మద్యం సేవించి ఇంటికి రావడం ఆమెకు నచ్చేది కాదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా.... దాదాపు ఒంటి గంట సమయంలో అతను మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అయితే... అతను లోపలికి రావడానికి ఆమె అంగీకరించలేదు.

అతనిని ఇంట్లోకి రావొద్దని చెప్పి వెళ్లి ఆమె ఇంట్లో నిద్రించింది. అతను ఆరుబయటే పడుకున్నాడు. దాదాపు 2గంటల సమయంలో నిద్రలో నుంచి లేచిన అతను.... వేడి వేడి నూనె తీసుకువెళ్లి నిద్రపోతున్న ఆమె ముఖంపై పోశాడు. దీంతో ఆమె గట్టిగా అరుస్తూ.. కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకొని వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.