భార్యతో గడిపిన ఫోటోలను ఓ ప్రబుద్ధుడు సోషల్ మీడియాలో పెట్టాడు. అది కూడా ఆమెకు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన  యువకుడితో మూడేళ్ల క్రితం వివాహైంది. ఈ మూడేళ్ల పాటు వారి సంసారం బాగానే సాగింది. అయితే.. ఇటీవల ఆమె భర్త..  ఉద్యోగం పరంగా ఆస్ట్రేలియా వెళ్లాడు. త్వరలోనే వచ్చి తనను కూడా తీసుకువెళతాడని భావించింది. అయితే.. ఆమెను తీసుకుపోగా.. అక్కడి నుంచే షాకిచ్చాడు.

ఆస్ట్రేలియా నుంచి భార్యకు ఫోన్ చేసి ఫోన్ లోనే విడాకులు ఇచ్చాడు. కాగా.. ఇటీవల గతంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను మరికొంత ఆశ్లీలత జోడించి.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి.. వేధించడం మొదలుపెట్టాడు. దీంతో.. విసిగిపోయిన యువతి పోలసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.