తన ప్రేమను అంగీకరించలేదని స్నేహితురాలితో పాటు ఆమె కుటుంబం మొత్తాన్ని సజీవదహనం చేయడానికి ప్రయత్నించాడో ఉన్మాది.
చెన్నై: తెలిసిన వాడే కదా అని ఇంట్లో ఆశ్రయమిచ్చిన యువతి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడో దుర్మార్గుడు. యువతితో పాటు ఆమె కుటుంబం మొత్తాన్ని సజీవదహనం చేయడానికి ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం తమిళనాడులో జరిగింది.
చెన్నై నగరంలో నివాసముంటున్న ఓ యువతిపై కాలేజీ రోజుల్లోనే కన్నేశాడు జీవానందం(22). వీరిద్దరు డిగ్రీ చదివే సమయంలో క్లాస్ మేట్స్. అయితే డిగ్రీ పూర్తయి వేరు వేరు పనుల్లో బిజీ అయినా స్నేహాన్ని మాత్రం కొనసాగించారు. ఈ చనువు కోద్దీ అతడు వ్యక్తిగత పనిపై చెన్నైకి రాగా యువతి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చింది.
read more హత్రాస్ దారుణాన్ని మరువకముందే... పొలాల్లో మరో యువతి మృతదేహం
ఈ క్రమంలోనే అతడు తన వక్రబుద్దిని బయటపెట్టాడు. అర్థరాత్రి సమయంలో యువతి నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పాడు. అంతేకాకుండా ఇష్టం వున్నా లేకున్నా ప్రేమించి తీరాలని హెచ్చరించారు.ఇందుకు యువతి అంగీకరించకపోవడంతో కోపోద్రిక్తుడయిన జీవానందం దారుణానికి ఒడిగట్టాడు. ఆశ్రయమిచ్చిన స్నేహితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులను ఓ గదిలో బంధించి గ్యాస్ లీక్ చేసి చంపేస్తానంటూ బెదిరించాడు.
అయితే గ్యాస్ లీకవుతున్న విషయాన్ని పక్కింటివారు గమనించి రావడంతో జీవానందం కంగారుపడిపోయి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అతన్ని పట్టుకున్నారు. దీంతో ఎక్కవ వారు తనను కొడతారో అని భయపడిపోయిన అతడు కిటికీ పగలగొట్టి గాజు పెంకుతో గొంతు కోసుకున్నాడు. అతన్ని ఆసత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
