ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు కన్నేశాడు. బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో.. సదరు యువతి గర్భం దాల్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


మహారాష్ట్రలోని థానే పట్టణణంలోని కళ్యాణ్ ప్రాంతంలోని ఓ మైనర్ బాలికకు తీరని అన్యాయం జరిగింది. మైనర్‌ బాలిక ఇంటిపక్కనే ఉన్న 21 ఏళ్ల యువకుడు కన్నేశాడు.  బాధితురాలికి మాయమాటలు చెప్పి గత కొన్ని రోజులుగా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ సదరు బాలికను బెదిరించాడు. కాగా.. అతని కారణంగా  బాలిక గర్భవతి అయింది. దీంతో కొద్ది రోజుల క్రితం బాధితురాలు ఓ శిశువుకి జన్మనిచ్చింది. బాలిక పెళ్లి చేసుకోమని కోరినప్పటికీ అతను నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో.. బాలిక ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది.

 వారు ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో నిందితుడు బిహార్‌ పారిపోయాడని పోలీసులు తెలిపారు. అతడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.