ఓ యువకుడు.. సినీ నటికి వీడియో కాల్ చేసి వేధించాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా.. ఆ సినీ నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

తనకు గుర్తుతెలియని ఓ యువకుడు వాట్సాప్ కాల్ చేసి తనను లైంగికంగా వేధించాడని ముంబైనగరానికి చెందిన 32 ఏళ్ల సినీనటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూకే కంట్రో కోడ్ ఉన్న ఫోన్ నంబరు నుంచి 20 ఏళ్ల యువకుడు ఓ సినీనటికి వాట్సాప్ కాల్ చేశాడు. 

సినీనటి వాట్సాప్ కాల్ ను రెండు సార్లు తిరస్కరించినా, మూడో సారి రావడంతో అనుకోకుండ కాల్ కు సమాధానం ఇచ్చారు. అంతే వీడియోకాల్ చూసి సినీనటి షాక్ కు గురయ్యారు. వీడియోకాల్ లో యువకుడు హస్తప్రయోగం చేస్తున్ననట్లు కనిపించడంతో సినీనటి దాన్ని స్క్రీన్ షాట్లు తీశారు. 

అనంతరం నిందితుడు సినీనటి పేరిట సంభోదిస్తూ సందేశాలు పంపించాడు. దీంతో యువకుడి హస్తప్రయోగం స్క్రీన్ షాట్, సందేశాలను పంచుకుంటూ ముంబై పోలీసులకు ట్యాగ్ చేశారు. దీంతో తాను ఇబ్బందుల్లో పడ్డానని గ్రహించిన నిందితుడు సినీనటికి క్షమాపణలు చెప్పారు. తాను 20 ఏళ్ల విద్యార్థినని, తాను పంపిన సందేశాలు, వీడియోకాల్ తన స్నేహితురాలికి ఉద్ధేశించినవని నిందితుడు పేర్కొన్నాడని సినీనటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.