కన్న కూతురిని పెళ్లాడి, గర్భవతిని చేసిన తండ్రి, తల్లి సమక్షంలోనే...

Man marries daughter, claims divine sanction
Highlights

వావివరసలు మరిచిన ఓ తండ్రి కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కూతిరినే పెళ్లాడాడు. అంతేకాకుండా ఆమెను గర్భవతిని కూడా చేశాడు. అయితే తనకు అల్లా ఆదేశించడం వల్లే ఇలా చేశానని ఇందులో తన తప్పేమి లేదని గర్వంగా చెబుతున్నాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ సంఘటకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  జిల్లాలోని కసియోజొరా గ్రామానికి చెందిన అఫాజుద్దిన్(36), సకీరా భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు సంతానం.  అయితే అఫాజుద్దిన్ అల్లా ఆదేశించాడంటూ తన కూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు.

అఫాజుద్దిన తన 15 ఏళ్ల పెద్ద కూతురిని వివాహం చేసుకున్నాడు. అంతే కాకుండా ఆమెతో సంసారం చేస్తూ గర్భవతిని కూడా చేశాడు. అయితే అతడికి భార్య సకీరా కూడా ఈ విషయంలో సహకరించింది. కూతురిని పెళ్లాడాలన్న భర్తకు సహకరించడంతో పాటు ఈ విషయాన్ని బైటికి పొక్కకుండా జాగ్రత్త వహించింది.

అయితే ఈ అమ్మాయి ఎక్కువగా బయటకు రాకపోవడం, ఆమె శరీరంలో మార్పులను గమనించిన స్థానికులు ఈ విషయంపై ఆరా తీయడంతో అసలు విషయం బైటపడింది. దీంతో ఈ సమాచారం పోలీసులకు చేరడంతో దారుణానికి పాల్పడిన అఫాజుద్దిన్ ను అరెస్ట్ చేశారు. 

ఇలా కన్న కూతురిని గర్భవతిని చేసిన తండ్రి కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. మూడనమ్మకాలతో కన్న కూతురిపై దారుణానికి ఒడిగట్టిన అఫాజుద్దిన్ ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 
 
loader