బెంగళూరులో ఓ వ్యక్తికి పోయిన పర్స్ తిరిగి దొరికింది. ఓ వ్యక్తి కేఫ్ కి వెళ్లి.. అక్కడ తన పర్స్ మర్చిపోయాడు. అయితే.. ఆ కేఫ్ లు పెద్ద మనసు చేసుకొని అతని పర్స్ అతనికి మళ్లీ అప్పగించారు. 

ఈరోజుల్లో వస్తువులు పోగొట్టుకోవడం చాలా సులభం. కానీ పొగొట్టుకున్న వస్తువు తిరిగి దొరకడం అంత సులువు కాదు. దొరికిన వస్తువును తిరిగి అప్పగించేవారు ఈ రోజుల్లో చాలా అరుదు. ముఖ్యంగా డబ్బులు ఉన్న పర్స్, ఏటీఎం కార్డ్స్, పోన్లు పోయాయంటే.. తిరిగి పొందడం అంటే మాత్రం చాలా అదృష్టం ఉండాలి. తాజాగా బెంగళూరులో ఓ వ్యక్తికి పోయిన పర్స్ తిరిగి దొరికింది. ఓ వ్యక్తి కేఫ్ కి వెళ్లి.. అక్కడ తన పర్స్ మర్చిపోయాడు. అయితే.. ఆ కేఫ్ లు పెద్ద మనసు చేసుకొని అతని పర్స్ అతనికి మళ్లీ అప్పగించారు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఓ కేఫ్ కి కాఫీ తాగడానికి వెళ్లాడు. అయితే అక్కడ అతను అనుకోకుండా వ్యాలెట్ మర్చిపోయి వెళ్లిపోయాడు. అయితే... ఆ కేఫ్ సిబ్బంది పెద్ద మనసు చేసుకొని అతని వ్యాలెట్ అతనికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అతని ఫోన్ నెంబర్ ఉన్నా, ఆ పర్స్ లో ఏదైనా సమాచారం ఉన్నా సులభంగా ఇచ్చేవారు. కానీ అలా ఏమీ లేదు. కానీ గూగుల్ లో వెతికి మరీ ఆయన నెంబర్ కనుక్కొని అతని వ్యాలెట్ అతనికి చేర్చారు. ఈ విషయాన్ని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.

Scroll to load tweet…


ఇదే విషయాన్ని రోహిత్ ఘుమారే ట్విట్టర్‌లో పంచుకున్నారు. తన వ్యాలెట్ లో క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉన్నాయని, దానిని పోగొట్టుకున్నానని అతను చెప్పాడు. ఆ వ్యాలెట్ పోయినందుకు చాలా భయడిపోయాను. కానీ కేఫ్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆ క్షణం నేను ఆశ్చర్యపోయాను. నా వ్యాలెట్ నాకు దొరికింది. అంటూ అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో, వైరల్ గా మారింది. అతని పోస్టుకి 37వేలకు పైగా వ్యూస్ రావడం విశేషం. కేఫ్ సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.