కలలో పాము కరిచిందని తెగ భయడిపోయాడు. ఆ భయంతో... వెంటనే వెళ్లి జోతిష్యుడిని కలిశాడు. చివరకు... నిజంగానే పాము చేత కరిపించుకొని.. నాలుక పోగొట్టుకున్నాడు. 

మనలో చాలా మందికి ప్రతిరోజూ కలలు వస్తూ ఉంటాయి. ఈ కలలు రావడం అనేది చాలా కామన్. వాటిలో కొన్ని మంచి కలలు కావచ్చు.. కొన్ని పీడ కలలు కూడా కావచ్చు. కొందరు వాటిని పట్టించుకోరు. మరి కొందరు మాత్రం వాటి గురించి చాలా సీరియస్ గా ఆలోచిస్తారు. ఓ వ్యక్తి కూడా అలానే... కలలో పాము కరిచిందని తెగ భయడిపోయాడు. ఆ భయంతో... వెంటనే వెళ్లి జోతిష్యుడిని కలిశాడు. చివరకు... నిజంగానే పాము చేత కరిపించుకొని.. నాలుక పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడురాష్ట్రం ఎరోడ్ లో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎరోడ్ లోని గోబిచెట్టియపాలెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(55) ఇటీవల నిద్రలో పాము కరిచినట్లు కల వచ్చింది. దానికి భయపడి... నిజంగా పాము కరవకుండా ఉండాలంటే ఏం చేయాలంటూ జోతిష్యుడిని కోరాడు. అతను.. నిజంగా పాముకు పూజ చేస్తే... ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని చెప్పాడు. ఈ క్రమంలోనే పాముకి పూజ చేస్తుండగా... పాము.. అతని నాలుకపై కాటు వేసింది. పాము విషయం ఎక్కడంతో అతను కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతనిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... నాలుక తీసేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు.

నాలుక మొత్తం విషం వ్యాపించడంతో... దానిని తీసేయక తప్పలేదని చెప్పారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.