ఒక్క అమ్మాయి కోసం ఇద్దరు యువకులు ఘర్షణ పడ్డారు. ఆ అమ్మయి నాదంటే నాదని గొడవ పడ్డారు. చివరకు ఈ ఘర్షణలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మనవాలనగర్‌కు చెందిన మణిబారతి అదే ప్రాంతానికి చెందిన యువతిని గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు. అదే అమ్మాయిని మహేష్‌కుమార్‌ సైతం ప్రేమిస్తున్నాడు. ఈ విషయం మణిభారతికి తెలిసింది. దీంతో మణిభారతి పలు సార్లు మహేష్‌కుమార్‌ను హెచ్చరించాడు.

అమ్మాయి కోసం ఇద్దరు యువకులు పలుమార్లు ఘర్షణ పడ్డారు. ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా మహేష్ కుమార్ లో మార్పు రాలేదు. దీంతో.. మణిభారతి పథకం ప్రకారం... మహేష్ ని హత్య  చేశాడు. స్నేహితుల సహాయంతో... పథకం రచించి దారుణంగా చంపాడు. అతని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు మణి భారతితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మరో ఐదు మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు గాలస్తున్న విషయం తెలుసుకున్న నిందితులు అజిత్‌(18), శివలింగం(19) కార్తీక్‌(19) విఘ్నేష్‌(20) దినేష్‌(18) ఎగ్మోర్‌ కోర్టులో లొంగిపోయారు.