ప్రేమగా చూసుకున్న భార్య, ప్రాణంగా పెంచుకున్న కూతురు ఇద్దరూ ఒకేసారి దూరమయ్యారు. ఓ మహిళ కారణంగా తన భార్య దారి తప్పిందని అతను భావంచాడు. తనని కాదని తన భార్య  పరాయి వ్యక్తితో లేచిపోయిందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అది జరిగిన కొద్ది రోజులకే కన్న కూతురు కూడా మరో యువకుడితో లేచి పోయింది. దీంతో అందుకు కారణమైన మహిళపై పగ పెంచుకున్నాడు.

పొరుగింటి మహిళ వల్లే తన భార్య, కూతురు లేచిపోయారనే కోపంతో ఓ వ్యక్తి ఆమెను అడవిలోకి తీసుకువెళ్లి హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో వెలుగుచూసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... లక్నో నగరానికి చెందిన షాహిద్ కి పెళ్లై భార్య, కుమార్తె ఉన్నారు. కాగా...  భార్య మరో వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుందని 2017లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం షాహిద్ కుమార్తె ఓ యువకుడితో లేచిపోయింది. తన భార్య, కుమార్తెలు లేచిపోవడానికి కారణం పొరుగింటి రేఖ అనే మహిళ కారణమని ఆమెపై పగ పెంచుకున్న షాహిద్ ఆమెను పథకం పన్ని హతమార్చాడు.

పొరుగింటి మహిళ అయిన రేఖను షాహిద్ అటవీప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ హత్య కేసులో నిందితుడైన షాహిద్ ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.