కోట: రాజస్థాన్ రాష్ట్రంలో ఓ వ్యక్తి అత్యంత దారుణమైన పని చేశాడు. భార్యను గొడ్డలితో నరికి హత్య చేసి భార్యను రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు.  ఈ దాడిలో అతని కుమారుడు కూడా మరణించాడు. రాజస్థాన్ లోని రామ్ పుర పరిధిలోని భాతాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

సునీల్ వాల్మీకి అలియాస్ పింటూ (40) కూలీ పనులు చేసుకుంటూ ఉంటాడు. మంగళవారం అతను సోదరుడి ఇంటిలో ఉన్న త భార్య సీమ (35), కుమారుడు అవినాశ్ (9 నెలలు)ను తీసుకుని వెళ్లాడు. సాయంత్రం పింటూ భార్యతో గొడవ పడ్డాడు. గొడవలో గొడ్డలితో భార్యను నరికాడు. దీంతో ఆమె మరణించింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 80 మీటర్ల మేర వీధిలో ఈడ్చుకెళ్లి అక్కడే వదిలేశాడు. సీమకు, పింటూకు మధ్య 15 ఏళ్ల క్రితం వివాహమైంది.

భార్యతో గొడవ పడుతున్న సమయంలో అతని కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. దాడిలో అతను గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను బుధవారం ఉదయం మరణించాడు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు పింటూను అరెస్టు చేశారు నిందితుడిపై ఇప్పటికే అత్యాచారం, దాడి, తదితరులు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

సరెండర్ కావడానికి పోలీసు స్టేషన్ వైపు వచ్చాడని, అయితే పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అతను సరెండర్ కాలేదని, సంఘటనా స్థలం నుంచే పారిపోయాడని పోలీసులు అంటున్నారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.