సమాజంలో రోజు రోజుకీ మానవ సంబంధాల విలువ తగ్గిపోతుంది. వివాహేతర సంబంధాల కోసం వెంపర్లాడుతున్నవారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. తాజాగా ఓ మహిళ భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంట్లోనే ప్రియుడి తో రాసలీలలకు దిగింది. దీంతో ఈ విషయం కాస్త భర్తకు తెలియడంతో.. భార్య ప్రియుడిపై దాడి చేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా గుండ్లుపేటే తాలూకా బీమనబీడు గ్రామానికి చెందిన మహిళ (25)తో 30 ఏళ్ల వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది. బుధవారం రాత్రి మహిళ ప్రియునితో కలిసి ఉండగా ఆమె భర్త కట్టె, కత్తితో ప్రియునిపై దాడిచేశాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని మైసూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. గుండ్లుపేటే పోలీసులు నిందితున్ని అరెస్ట్‌ చేశారు.