ఆమెకు అప్పటికే పెళ్లయ్యింది. పెళ్లి జరిగి కూడా దాదాపు 20 సంవత్సరాలు కావస్తోంది. ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వారు కూడా పెళ్లీడుకు వచ్చారు. అయినా ఆమె బుద్ధి మాత్రం వక్రంగానే ఆలోచించింది. భర్తను కాదని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఓ రోజు ప్రియుడితో సరసాలాడుతూ అసభ్య రీతిలో కూతురి కంట పడింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వేలూరు సమీపంలోని కమ్మవాన్‌పేటకు చెందిన సెల్వం అనే వ్యక్తికి చిత్రతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు, కాగా... కొన్నాళ్ళ క్రితం చిత్ర అదే గ్రామానికి చెందిన మరో యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి.

అయినా ప్రవర్తన మార్చుకోని చిత్ర... భర్త, కూతురు బయటకు వెళ్లినప్పుడు ప్రియుడిని రప్పించుకుంది. పనిమీద బయటకు వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాగా చిత్ర అసభ్యకర రీతిలో కనిపించింది. తల్లీ కూతుళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సెల్వం డ్యూటీ ముగించుకుని రాత్రి 12 గంటలకు ఇంటికి రాగా కూతురు విషయం మొత్తం చెప్పింది.

ఈ క్రమంలో... దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగింది. సెల్వం పెద్ద కర్రతో భార్య తలపై గట్టిగా కొట్టడంతో రక్తం కారుతూ ఆమె క్రింద పడిపోయింది. చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా ఇంటివద్దే ఆమె మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.