మాండ్యా: కర్ణాటక రాష్ట్రంలో ఓ వ్యక్తి అత్యంత దారుణమైన చర్యకు ఒడిగట్టాడు. బార్యపై అనుమానంతో ఆ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఆమె తల, కాళ్లు, చేతులు నరికి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి హేమావతి నదిలో పడేశాడు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

ఈ కేసులో మృతురాలి భర్తను, ఆమె బావను అరెస్టు చేశారు ఈ విషయాన్ని ఎస్పీ అశ్విని సోమవారం వెల్లడించారు. మాండ్యా జిల్లా పాండవపుర తాలూకా దేశవల్లికి చెందిన ఆశా (28), రంగప్ప భార్యాభర్తలు. వారికి ముగ్గురు పిల్లకు ఉన్నారు. భార్య అక్రమం సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రంగప్ప, ఆమె బావ చంద్రతో కలిసి అశను నరికి చంపాడు. 

కొడవలితో శరీరాన్ని ముక్కలు ముక్కులు చేసి హేమావతి నదిలో పడేశాడు. ఆయితే, వారిపై అశ తండ్రి గౌరి శంకర్ కు అనుమానం వచ్చింది. దాంతో ఆయన పాండవపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఆ క్రమంలో కృష్ణరాజపేట పోలీసులు గుర్తు తెలియని మృతదేహంపై సమాచారం ఇచ్చారు. గౌరి శంరక్ మృతదేహాన్ని చూసి తన కూతురిగా గుర్తించాడు. దీంతో పోలీసులు మృతురాలి భర్త రంగప్పను అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో వాస్తవం బయటపడింది. నాలుగు నెలల తర్వాత ఈ కేసు మిస్టరీ వీడింది.