భోపాల్: ఓ వ్యక్తి తన భార్యను చంపేసి ఆ తర్వాత బతికించడానికి మాంత్రికుడిని పిలిపించాడు. మాంత్రికుని సాయంతో భార్య మృతదేహాన్ని ఆవు పేడతో కప్పి తిరిగి బతికించాలని ప్రయత్నించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

బేతుల్ జిల్లాలోని చిచోలీ గ్రామంలో భైయలాల్ (46) తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు కూడా. భేయలాల్ మద్యానికి బానిస కావడంతో కావడంతో గత కొద్ది కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. దాంతో ముగ్గురు పిల్లలు కూడా వేరే చోటు నివసిస్తున్నారు. 

ఆగస్టు 26వ తేదీన తాగి వచ్చిన భేయలాల్ భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ తీవ్రమైంది. ఈ గొడవలో చెక్క కర్రతో భేయలాల్ భార్య తలపై కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. 

అయితే, మరణించిన భార్యను బతికించుకునేందుకు ఓ మాంత్రికుడు అతనికి చెప్పాడు. ఆ మాంత్రికుడి సలహా మేరకు ఆమె మృతదేహాన్ని ఆవు పేడతో కప్పి రెండు రోజుల పాటు అలాగే ఉంచాడు. నిందితుడి ఇంటికి మాంత్రికుడి చేరుకునేలోపునే పోలీసులకు విషయం తెలిసింది. 

ఆగస్టు 28వ తేదీన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే శవం పాక్షికంగా కుళ్లిపోయింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాంత్రికుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.