కూతురితో సమానంగా చూడాల్సిన  కోడలిపైనే ఓ మామ కన్నేశాడు. కన్న కొడుకు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నిజం తెలుసుకున్న అతని కొడుకు.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో... కోపంతో తండ్రిని, కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా ఇండగి తాలుకాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఖేడగి క్రాస్‌లోని ఓ తోటలో మాళప్ప పూజారి, కుమారుడు పుట్టణ్ణ పూజారి, అతడి భార్య రేణుకా పూజారిలు పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా కోడలు రేణుకా పూజారితో మామ మాళప్ప పూజారికి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వీరు ఇదే జిల్లా శిరగూరు గ్రామానికి చెందినవారు కాగా జీవనం కోసం ఖేడగి క్రాస్‌లోని ఓ తోటలో నివసిస్తున్నారు.
 
తండ్రి, భార్యల మధ్య వివాహేతర సంబంధం ఉందనే విషయం తెలుసుకున్న పుట్టణ్ణ రాత్రి ఆగ్రహానికి లోనయ్యాడు. ఇరువురూ ఇంట్లో కలసి ఉండడాన్ని చూసి మాళప్ప పూజారి (65), రేణుకాపూజారి (35)లను పుట్టణ్ణ దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారీ అయ్యాడు. కాగా.. వాళ్లిద్దరూ విగతజీవులుగా పడి ఉండటాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. ఈ మేరకు ఇండగి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.