లైంగిక కోరిక తీర్చలేదని ఓ వ్యక్తి వివాహితను హతమార్చాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పాల్ గర్ లో చోటుచేసుకుంది. కాగా... నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ నెల 15వ తేదీన ఓ వివాహిత పొలానికి వెళ్తూ ఉంది. కాగా... ఆమెను రాజేశ్ పవార్(30) అనే వ్యక్తి అడ్డగించాడు. తన లైంగిక కోరిక తీర్చాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు ఆమె అంగికరించకపోవడంతో... బెదిరింపులకు పాల్పడ్డాడు.

అయినా అతని కోరికను తీర్చడానికి ఇష్టపడని ఆ మహిళ.. వెంటనే ఈవిషయాన్ని తన భర్త, గ్రామస్తులతో ఈ విషయాన్ని చెప్పేసింది. దీంతో కోపంతో రగిలిపోయిన రాజేష్.. తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఆమెను కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు.