ప్రేమించిన యువతి శృంగారానికి నిరాకరించిందని ఓ వ్యక్తి దారుణానికి ఒడికట్టాడు. కక్షతో ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన చెన్నైలో కలకలం రేపింది. 

చెన్నై : ప్రేమిస్తే చాలు మహిళలు ఏం చెబితే అది చేయాలని కోరుకుంటారు. దానికి నిరాకరిస్తే దారుణానికి తెగబడతారు. ఇలాంటి మృగాళ్లు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు. ఓ వ్యక్తి ఓ మహిళను ఐదేళ్లుగా ప్రేమించాడు. ప్రేమించాను కదా అని శారీరక సంబంధానికి బలవంతం చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో దారుణానికి తెగబడ్డాడు. విచక్షణ మరిచి ఆమె మీద కత్తితో దాడి చేశాడు. 

sexకి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిని knifeతో పొడిచి చంపిన ప్రియుడు బాగోతం tamilnadu రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది. చెన్నైలోని కుండత్తూర్ ప్రాంతానికి చెందిన రాజా(38) అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఓ womanను గత ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. మహిళ అద్దె ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో కూలీగా పని చేస్తుండేది. శనివారం రాత్రి పీకల దాకా liquor తాగిన రాజా ప్రియురాలి ఇంటికి వెళ్లి తనతో పడుకోమని బలవంతం చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు.

దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రియుడు, ప్రియురాలు గొడవ పడుతుండడంతో... ఇరుగుపొరుగు వారు వచ్చి రాజాను ఇంటి నుంచి పంపించి వేశారు. అందరూ అక్కడినుంచి వెళ్లిపోయి.. నిద్రపోయాక తిరిగివచ్చిన రాజా.. ప్రియురాలిని బంధించి కత్తితో పొడిచి పారిపోయాడు. రక్తపు మరకలతో ఉన్న షర్టు ధరించిన రాజా కుండ్రత్తూర్ వద్ద కూర్చుని ఉండగా గస్తీ పోలీసులు పట్టుకుని ప్రశ్నించారు. దీంతో హత్య విషయం వెలుగుచూసింది. తన ప్రియురాలిని హత్య చేసినట్లు రాజా అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. 

ఇదిలా ఉండగా, సమాజంలో యువతులు, మహిళలపై రోజురోజుకు లైంగిక దాడులు పెరుగుతున్నాయి. కొందరు మృగాళ్ళు నమ్మించి మహిళను లొంగదీసుకుంటున్నారు. picnic పేరుతో ఓ మహిళను వంచించి చివరకు ఆమెకు poison తాగించారు. అమాయకంగా ప్రియుడిని నమ్మి వచ్చిన ఆ బాధితురాలు చావుకు ముగ్గురు కారణమయ్యారు. ఈ దారుణ ఘటన Madhya Pradeshలో చోటుచేసుకుంది.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ (28)తో షాదబ్ ఉస్మాన్ అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఏడాదిగా వారి మధ్య Extramarital affair నడుస్తోంది. కాగా, పిక్నిక్ పేరుతో ఆమెను.. నిందితుడు షాదోల్ జిల్లాలోని క్షీర్ సాగర్ తీసుకెల్లాడు. అక్కడికి ఉస్మాన్ స్నేహితులు రాజేష్ సింగ్, సోనూ జార్జ్ సైతం వచ్చారు. ఈ క్రమంలో వారు ఫుల్లుగా మద్యం సేవించి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. 

అంతటితో ఆగకుండా పైశాచికత్వంతో బలవంతంగా ఆమెకు విషం తాగించారు. ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. అమె చనిపోవడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నివేదికలో ఆమెపై లైంగిక దాడి చేసి, విషప్రయోగం జరిగినట్లు వైద్యులు తేల్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.