తల్లి లాంటి పిన్నితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె మరో వ్యక్తికి దగ్గరయ్యిందనే కోపంతో ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణగిరి జిల్లా కావేరి పట్టణం సమీపంలోని పొత్తపురమ్‌ మణిమాడికొట్టాయి ప్రాంతానికి చెందిన మలర్‌ (38) భర్త మృతి చెందాడు. అప్పడాలు తయారుచేసి విక్రయిస్తూ జీవిస్తోంది. రెండు రోజులకు ముందు రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి బయలుదేరింది. రాత్రి చాలాసేపు అయినా గానీ ఆమె ఇంటికి రాలేదు. బంధువులు వేర్వేరు స్థలాల్లో వెదికినా ఆమె ఆచూకీ లభించలేదు. 

శనివారం పొత్తాపురం సమీపంలో ఉన్న కాలువలో మలర్‌ శవంగా పడి ఉంది. కావేరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టగా మలర్‌కి, ఆమె బంధువు అయిన గాంధీ (28)కి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. గాంధీని పట్టుకుని పోలీసులు విచారించగా అతడు మలర్‌ను హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. ‘మలర్‌ నాకు పిన్ని వరస. అయినా ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడింది. 

కొన్ని రోజుల ముందు ఆమెకు మరొకరితో పరిచయం ఏర్పడింది. మందలించినా ఆమె వినకుండా అతడితో చనువుగా ఉంటూ వచ్చింది. ఈ విషయమై మా మధ్య గొడవ జరిగింది. ఘటన జరిగిన రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న నేను క్వార్టర్‌ బాటిల్‌ను పగులగొట్టి తలపై పొడిచి హత్య చేశాను. తరువాత ఆమెను కాలువలో విసిరేసి వెళ్లిపోయాను’ అని గాంధీ వెల్లడించాడు