వివేక్ తన కూతుర్ని తీసుకొని ఆమెను తలుపు, ఇంటి మెట్ల మీద కొట్టాడు. అడ్డుకోబోయిన తనపై కూడా దాడి చేయగా, తాను పారిపోయానని భార్య వర్షా చెప్పారు.
తన చిన్నారి కూతురు స్వీటు కొనిచ్చేందుకు ఐదు రూపాయలు అడిగిందని...తన కుమార్తెను తలుపు మీద కొట్టి చంపిన కసాయి తండ్రి బాగోతం మహారాష్ట్ర లోని గోండియా జిల్లాలో వెలుగుచూసింది. గోండియా జిల్లా లోనారా గ్రామానికి చెందిన వివేక్, వర్షా దంపతులకు 20నెలల వైష్ణవి అనే కూతురుంది. తనకు స్వీటు ఇప్పించమని తన కూతురు ఏడుస్తుండటంతో తాను భర్తను ఐదు రూపాయలు ఇవ్వాలని అడిగానని భార్య వర్షా చెప్పింది.
వివేక్ తన కూతుర్ని తీసుకొని ఆమెను తలుపు, ఇంటి మెట్ల మీద కొట్టాడు. అడ్డుకోబోయిన తనపై కూడా దాడి చేయగా, తాను పారిపోయానని భార్య వర్షా చెప్పారు. తీవ్రగాయాల పాలైన వైష్ణవిని టిరోడా ఉప జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలిక మరణించిందని వైద్యులు చెప్పారు. దీంతో భార్య వర్షా భర్త వివేక్ పై టిరోడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కసాయి భర్త వివేక్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
