భర్తకు తెలీకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త భర్తకు తెలియడంతో.. ఆగ్రహంతో ఊగిపోయాడు.

అతనికి భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అలాంటి భర్తను ఆమె మోసం చేసింది. భర్తకు తెలీకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త భర్తకు తెలియడంతో.. ఆగ్రహంతో ఊగిపోయాడు. చివరకు.. భార్య ప్రియుడి చేతిలో హతమయ్యాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంబూరు సమీపంలోని బాలూరు గ్రామానికి చెందిన గోవిందస్వామి(55) అగ్గెపెట్టెల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఢిల్లీబాబు. ఇతని భార్య లక్ష్మి. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఢిల్లీబాబు దోబీ దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఈక్రమంలో గోవిందస్వామికి, లక్ష్మీకి వివాహేతరసంబంధం ఏర్పడింది. మంగళవారం రాత్రి 10 గంటలకు ఢిల్లీబాబు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా గోవిందస్వామి, లక్ష్మి గదిలో చనువుగా ఉన్నారు. ఆగ్రహించిన ఢిల్లీబాబు కత్తితో గోవిందస్వామిపై దాడి చేశాడు. దాడిలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆంబూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని నిందితుడు ఢిల్లీబాబు కోసం గాలిస్తున్నారు.