అది కాస్త బాలిక తండ్రి కంట పడింది. ఇంకేముంది ఆవేశంతో ఊగిపోయాడు. చంపేసి.. గదిగడియ పెట్టాడు. అయితే.. తమ కుమారుడు కనిపించడం లేదంటూ.. బాలుడి కుటుంబసభ్యులు ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది
ఓ బాలిక.. ఓ బాలుడిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో తెలీకుండా వారు జాగ్రత్తపడ్డారు. అయితే ఓ రోజు బాలుడు ఏకంగా.. ఆ బాలిక ఇంటికి వచ్చేశాడు. ఎవరూ లేని సమయంలో ఇద్దరూ ఏకాంతంగా గదిలో గడుపుతున్నారు. అది కాస్త బాలిక తండ్రి కంట పడింది. ఇంకేముంది ఆవేశంతో ఊగిపోయాడు. చంపేసి.. గదిగడియ పెట్టాడు. అయితే.. తమ కుమారుడు కనిపించడం లేదంటూ.. బాలుడి కుటుంబసభ్యులు ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కాన్పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ట్రక్ డ్రైవర్ కుమార్తె ఓ బాలుడిని ప్రేమిస్తుంది. వారి ఇంట్లో వాళ్లు శనివారం వేరే గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న బాలుడు వెంటనే అమ్మాయి ఇంట్లోకి దూరిపోయి గడియ పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ బాలిక బంధువు ఇంటికి బయట నుంచి తలుపేశాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తండ్రికి సమాచారం అందించాడు. అయితే తమ కుమారుడు కనిపించడం లేదని ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో ఆదివారం బాలుడు ఎక్కడ ఉన్నాడో ఒకరు సమాచారం ఇవ్వడంతో తండ్రికి అక్కడకు వెళ్లాడు. తలుపు తీసి చూడగానే బాలిక బాలుడు రక్తపు మడుగులో కనిపించాడు. బాలిక తండ్రి గొడ్డలితో కూతురితో పాటు ఆ బాలుడిని హత్య చేశాడు. ఈ ఘటనతో ఊరి జనమంతా షాక్ తిన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. తండ్రిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
