ఇద్దరు ప్రేమికుల మధ్య ఫోన్ కాల్స్ చిచ్చుపెట్టాయి. వారి నిండు జీవితాల్ని బలి తీసుకున్నాయి. అనుమానం పెనుభూతమై.. యువతి ప్రాణం తీయగా, ప్రియుడిని నేరస్తుడిని చేసింది.. వివరాల్లోకి వెడితే..
న్యూఢిల్లీ : వాళ్లు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఇంతలో ఒక phone call వారిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. దీంతో hotel roomలో వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి దారుణం జరిగింది. ఈ ఘర్షణలో ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ
షాకింగ్ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. యూపీలోని ఘజియాబాద్ కు చెందిన శివమ్ చౌహాన్ (28), ఢిల్లీలోని కిషన్ గడిపి చెందిన ఓ యువతి నాలుగేళ్లుగా love చేసుకుంటున్నారు. వీరిద్దరు ఏకాంతంగా కలుసుకునేందుకు ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ హోటల్ కు వెళ్లారు.
ఈ క్రమంలో వారు హోటల్ రూమ్ లో ఉండగా.. ఆమెకు ఓ వ్యక్తి వరుసగా కాల్స్ చేశాడు. దీంతో శివమ్ ఎవరు అని ప్రశ్నించగా తన సోదరి ప్రియుడు అని ఆమె చెప్పింది. ఆమె మాటలు నమ్మని చౌహాన్.. మళ్లీ ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో ఆవేశంతో శివమ్.. ఆమె తలను నేలకేసి కొట్టడంతో బాధితురాలు అక్కడికక్కడే death అయ్యింది. ఇదిలా ఉండగా.. మరుసటి రోజు చౌహాన్ ఒక్కడే రూం నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత dead bodyని గుర్తించిన హోటల్ సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా శివమ్ ను పట్టుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు విచారించగా.. తన ప్రియురాలు తనను మోసం చేసి ఉత్కర్ష్ అనే మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్లు చెప్పాడు. అందుకే తాను ఆమెను హత్య చేసినట్లు తెలిపాడని డిసిపి గౌరవ్ శర్మ వెల్లడించారు.
కాగా, మధ్యప్రదేశ్ లోనూ ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. భార్యను ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. వారిద్దరినీ చెట్టుకు కట్టేసి మరీ చితకబాదాడు. ఈ సంఘటన madhyapradeshలోని రాజ్ ఘర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భర్త కళ్లుగప్పి ఓ మహిళ చెయ్యకూడని తప్పు చేసింది. భర్త లేని సమయంలో ప్రియుడితో కలిసి ఇంట్లోనే extramarital affairని గత కొన్నాళ్లుగా కొనసాగిస్తూ వచ్చింది.
అయితే ఎట్టకేలకు ఆ వివాహిత నిజస్వరూపం బయటపడింది. కాగా ఓ రోజు ఇంట్లోనే తన భార్యను మరో వ్యక్తితో చూడడంతో భర్త తట్టుకోలేకపోయాడు. భార్య చేసిన తప్పుడు పని గ్రామస్తులు అందరికీ తెలియజేయాలనుకున్నాడు ఆ భర్త. దాంతో ఊరి మధ్యలో ఉన్న ఓ చెట్టుకు కట్టేసి భార్యతో పాటు తన ప్రియుడికి కూడా దేహశుద్ధి చేశారు. వివాహితతో పాటు ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేయడానికి సదరు భర్త బంధువులు కూడా అతనికి అండగా నిలిచారు. ఇలా రెండు గంటల పాటు ఇద్దరిని చితకబాదుతుండగా.. వాళ్ళ అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
అయితే స్థానికులు దీనికి సంబంధించిన దృశ్యాలను షూట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త వైరల్ అయింది. భర్తతో కాపురం చేస్తూనే మరో వైపు ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వివాహేతర సంబంధం నడుపుతున్న విషయం బయట పడడంతో గ్రామస్తులు కూడా వివాహితపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చెట్టుకు కట్టేసి వివాహితతో పాటు ఆమె ప్రియుడిని కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు.. భార్య తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కానీ వారిని శిక్షించడాన్ని తప్పుపట్టారు. వారిపై దాడి చేసిన భర్తపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత భార్య భర్తలు ఇద్దరిని కలిపేందదుకు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
