ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి భార్య గొంతును బ్లేడ్ తో కోసి హత్య చేశాడు.

ఉత్తరప్రదేశ్‌ : Uttarpradeshలోని బులంద్‌షహర్‌లోని గులావతి పోలీస్ స్టేషన్ పరిధిలో కట్నం కోసం తన భార్య మీద హత్యాప్రయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తన భర్త Surgical blade‌తో తనపై దాడి చేశాడని చనిపోవడానికి ముందు మృతురాలు పోలీసులకు 
Video statement ఇచ్చింది. ఆ తరువాత చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆమె చనిపోయింది.

ఈ ఘటప శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పూనమ్ అనే సదరు మహిళ... బరాల్ గ్రామంలోని ఓ ప్రైవేట్ క్లినిక్ ప్రాంగణంలో ఉండగా, నిందితుడు నీరజ్ సర్జికల్ బ్లేడ్‌తో ఆమె మీదదాడి చేశాడు. అయితే అతను అంతకుముందు పూనమ్ మీద వరకట్నం వేధింపులకు పాల్పడ్డారని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

వివరాల్లోకి వెడితే.. పూనమ్ గతంలో హాపూర్‌లోని నర్సింగ్‌హోమ్‌లో పనిచేసేది. అక్కడ నర్సింగ్‌హోమ్ బయట నీరజ్ కు మెడికల్ స్టోర్ ఉండేది. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తరువాత క్రమంగా అది ప్రేమగా మారి.. ఇద్దరూ ఐదేళ్ల క్రితం కోర్టు వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే పూనమ్ కు పెళ్లి అయి, విడిపోయింది. ఇది పూనమ్‌కి రెండవ వివాహం. ఆ దంపతులకు ఒక కూతురు కూడా ఉంది.

కొద్దికాలం సజావుగానే సాగిన వీరి సంసారం.. కొంత కాలం తర్వాత గొడవలు మొదలయ్యాయి. పరిస్థితులు క్షీణించడం ప్రారంభించాయి. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, పూనమ్‌ను నీరజ్ పలు సందర్భాల్లో కొట్టాడని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే పూనమ్ బులంద్‌షహర్‌కు వచ్చి బరాల్ గ్రామంలోని క్లినిక్‌లో పనిచేయడం మొదలుపెట్టింది. 

ఇదిలా ఉంటే, పూనమ్ కుటుంబం కూడా నీరజ్ కు తాగుడు అలవాటు ఉందని, పూనమ్‌ను వరకట్నం కోసం పదే పదే వేధించేవాడని ఆరోపించింది. ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా పూనమ్‌పై దాడి చేశాడని తెలిపారు. ఆ సమయంలో ఆమె ప్రాణాలతో బయటపడిందని కానీ, ఈ సారి తప్పించుకోలేకపోయిందని అన్నారు.

కట్నం కోసం హత్య
శనివారం మధ్యాహ్నం పూనమ్ క్లినిక్‌కి చేరుకున్న నీరజ్ ఆమెపై సర్జికల్ బ్లేడ్‌తో దాడి చేశాడు. పూనమ్ ప్రతిఘటించడానికి ప్రయత్నించినప్పుడు, నీరజ్ ఆమె గొంతు కోసి, బ్లేడ్‌తో చాలాసార్లు దాడి చేశాడు, ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి నేరానికి ఉపయోగించిన సర్జికల్ బ్లేడ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా, 

Uttarpradeshలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్‌లో తన ప్రేమికుడిని కలవడానికి ఓ మహిళ మరీ దారుణానికి తెగబడింది. తన nephew సహాయంతో సదరు ప్రేమికుడి 6 ఏళ్ల సోదరుడిని కిడ్నాప్ చేసింది. సదరు 32 ఏళ్ల మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే, బాలుడు కనిపించకుండా పోవడంతో ఆరు రోజులుగా పోలీసులు బాలుడి కోసం వెతుకుతున్నారు. కాగా kidnap చేసిన తరువాత ఆ చిన్నారిని మహిళ తన వద్దే ఉంచుకుంది. వివరాల్లోకి వెడితే.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఛతరీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఫిబ్రవరి 15న హిమ్మత్‌గర్హి గ్రామంలో తన ఇంటి ముందు ఆడుకుంటున్న డోరిలాల్‌ (6) అనే చిన్నారి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది.

దీంతో అంతా వెతికిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్టైంట్ మేరకు కేసు నమోదు చేసి చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. అయితే ఇదంతా ఆ చిన్నారి అన్నను కలవడానికి అతని ప్రేమికురాలు చేసిన దారుణం అని తేలింది. దీంతో ఆమెతో సహా కిడ్నాప్ కు సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.