ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి తన ప్రియురానికి చంపి తనింట్లోనే గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. ఈ విషయం రెండేళ్ల తరువాత వెలుగులోకి రావడంతో స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఆగ్రా : ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలోని వ్యక్తి మైనర్ బాలికతో తనకున్న సంబంధం బయటపడకుండా ఉండాలని.. పదహారేళ్ల ఆమెను చంపి తన ఇంట్లోనే ఓ గదిలో పూడ్చి పెట్టాడు. తన ఉంది. దీన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాడు. దీనికి అతని కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. ఆమె అస్థిపంజరం రెండేళ్ల తర్వాత దొరికింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో నిందితుడు 25 ఏళ్ల గౌరవ్‌సింగ్ తన కుటుంబంతో సహా పారిపోయాడు.
సింగ్‌పై ఆరోపించబడిన కిడ్నాప్ నేరం మీద కేసు పెండింగ్ లో ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న పోలీసు అధికారులు.. కేసును త్వరగా పరిష్కరించాలని ఫిరోజాబాద్‌లోని ఎస్‌ఎస్‌పి, ఆశిష్ తివారీ, నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఇటీవల పోలీసులను ఆదేశించారు. దీంతో శనివారం సింగ్, అతని తండ్రి చంద్రభాన్‌లను అరెస్టు చేశారు. విచారణలో బాలికను హత్య చేసినట్లు వారు అంగీకరించారని పోలీసులు తెలిపారు. తరువాత, సిర్సాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే కితోత్ గ్రామంలో నిందితుడి ఇంటిలోని ఒక గదిలో తవ్వగా.. ఒక బృందం బాధితురాలు అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుంది.
కడియాల కోసం దారుణం.. 108యేళ్ల వృద్ధురాలి కాళ్లు కోసేసిన నిందితులు..
బాధితురాలి పొరుగున ఉండే నిందితుడు.. ఆమెకు మోటార్‌సైకిల్ నడపడం నేర్పించే వంకతో ఆమెతో సంబంధం పెట్టుకున్నట్లు నిందితుడు విచారణలో పోలీసులకు తెలిపాడు. ఇది తెలిసిన వారి కుటుంబ సభ్యులు దీనిని వ్యతిరేకించారు. దీంతోపాటు బాధితురాలు తనను వివాహం చేసుకోవాలని "ఒత్తిడి" చేయడంతో ఏం చేయాలో తెలియలేదని పేర్కొన్నాడు.
"గౌరవ్, అతని తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులతో కలిసి బాలికను చంపడానికి పథకం వేశాడు. నవంబర్ 21, 2020న గౌరవ్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తరువాత ఇంట్లో, అతను తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను గొంతు కోసి చంపాడు. ఆ తరువాత ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు మృతదేహాన్ని దాచి పెట్టాలనుకున్నారు. దీనికోసం కుటుంబ సభ్యులు తమ ఇంట్లోని ఒక గదిలో ఒక మూల తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. తర్వాత, గది ఉపరితలం చదును చేసి గోధుమ పొట్టుతో కప్పారు. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో నిందితులు అతని కుటుంబ సభ్యులతో సహా పారిపోయారు. నవంబర్ 23న బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టినట్టు ఫిరోజాబాద్ ఏఎస్పీ కుమార్ రణ్‌విజయ్ సింగ్ తెలిపారు.
ఎస్ఎస్పీ ఆశిష్ తివారీ మాట్లాడుతూ, "ప్రధాన నిందితుడు అతని కుటుంబ సభ్యులు అప్పటినుంచి ఒక్కచోట ఉండకుండా తిరుగుతున్నారు. గౌరవ్, అతని తండ్రి, ఇద్దరు సోదరులు గత రెండు సంవత్సరాలుగా యుపి, హర్యానా, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసును పరిష్కరించడానికి గత నెల రోజులుగా గట్టిగా చేసిన ప్రయత్నాలు చివరకు విజయవంతమయ్యాయి. నిందితుడితో పాటు అతని తండ్రిని కూడా అరెస్టు చేశారు.
"అమ్మాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. నిందితుడి ఇంటికి సీలు వేశారు. గౌరవ్ తల్లి, ఇద్దరు సోదరులతో సహా మరో ముగ్గురు నిందితుల కోసం మా బృందాలు వెతుకుతున్నాయి. వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తాం" అని పోలీసులు తెలిపరు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు, బాధితురాలు కేవలం నాలుగు ఇళ్ల దూరంలోనే ఉంటున్నారు. గౌరవ్ తండ్రి చంద్రభాన్ కూడా అక్కడే కూలీగా పనిచేసేవాడు. అమ్మాయి తండ్రి చిన్న రైతు. నిందితులు, బాధితురాలు ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారు. రెండేళ్ల తర్వాత శుక్రవారం నిందితుడి ఇంటిని తెరిచారు. "అమ్మాయి బతికే ఉందని, గౌరవ్‌తో కలిసి సంతోషంగా ఉందని అనుకున్నామని..’ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ గ్రామస్తుడు అన్నాడు.
