సిగరెట్ కోసం: అలవాటు మానుకోవాలన్న తమ్ముడిని చంపిన అన్న

man kills brother for smoking
Highlights

సిగరేట్ కాల్చే అలవాటు మానుకోవాలని అన్నయ్య క్షేమాన్ని కోరి చెప్పిన తమ్ముడిని చంపేశాడు ఓ అన్న

సిగరేట్ కాల్చే అలవాటు మానుకోవాలని అన్నయ్య క్షేమాన్ని కోరి చెప్పిన తమ్ముడిని చంపేశాడు ఓ అన్న. సెంట్రల్ ఢిల్లీలో నివాసం ఉంటున్న శిశుపాల్‌ కుమార్‌కి సిగరెట్లు తాగడం అలవాటు.. అది కూడా ఒకటి రెండు కాదు.. పెట్టెలు పెట్టెలు ఖాళీ చేయాల్సిందే. అతని ఆరోగ్యాన్ని ఏం చేసుకున్నా పర్లేదు కానీ.. అన్నయ్య వల్ల ఇంట్లోని వారందరూ అనారోగ్యానికి గురవుతుండటంతో అతని తమ్ముడు సత్యపాల్ .. ఈ అలవాటును మానుకోవాలని ఎన్నోసార్లు చెప్పాడు. కాని శిశుపాల్ పట్టించుకోలేదు..

ఇదే విషయంపై ఇద్దరి మధ్యా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత బుధవారం వారిద్దరి మధ్య గొడవ ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహం పట్టలేకపోయిన శిశుపాల్ తమ్ముడిపై దాడి చేశాడు. తన షూ లేస్‌ని సత్యపాల్ మెడకి గట్టిగా బిగించడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.. అయితే తాను నేరం నుంచి తప్పించుకోవడానికి దీనిని సహజ మరణంగా నమ్మించేందుకు డ్రామా ఆడాడు..

తమ్ముడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని తండ్రికి సమాచారం ఇచ్చి.. సత్యపాల్‌ను ఆస్పత్రికి తరలించాడు..  అక్కడ ఆసుపత్రి సిబ్బందికి అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి చేసిన పోస్ట్‌మార్టంలో సత్యపాల్‌ గొంతు నులిమి చంపబడ్డాడని తేలింది.. దీంతో శిశుపాల్‌ను పోలీసులు గట్టిగా నిలదీయడంతో తమ్ముడ్ని తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. 

loader