ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తి అడ్డుగా ఉందని తన 8యేళ్ల కూతురిని దారుణంగా హతమార్చాడు. ఆ తరువాత ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుని ఇంటికి వెళ్లాడు.  

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో 8 ఏళ్ల చిన్నారి దారుణంగా హత్య కలకలం రేపింది. ఇది వెలుగు చూసిన ఐదు రోజుల తర్వాత, ఆమె హత్య వెనుక తండ్రి హస్తం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆత్మహత్య చేసుకోవాలనే అతడి ప్లాన్‌కు చిన్నారి అడ్డుగా వచ్చింది. హత్యా నేరం కింద మహ్మద్ ఇక్బాల్ ఖతానాను పోలీసులు అరెస్ట్ చేశారు.

వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల ఇక్బాల్ తను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దీనికి తన కుమార్తె అడ్డు రావడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బుధవారం సాయంత్రం, తన భార్యతో గొడవపడి ఇక్బాల్ ఆత్మహత్య చేసుకోవాలనుకుని.. కత్తితో ఇంటి నుండి బయలుదేరాడు. కానీ 8 ఏళ్ల చిన్నారి తన తండ్రితోపాటు వస్తానని మొండిపట్టు పట్టింది. భార్యాభర్తల మధ్య ఏదో విషయంగా నిత్యం గొడవలు పరిపాటిగా మారాయని పోలీసులు తెలిపారు.

షాకింగ్... ప్రియుడిని చంపి, ముక్కలుగా నరికి.. 400 కి.మీ దూరం తీసుకువెళ్ళి.. ఇసుకలో పాతిపెట్టిన మహిళ..

ఈ క్రమంలోనే చిన్నారి వెంటపడింది. డబ్బులిచ్చి ఏమైనా కొనుక్కోమని చెప్పినా.. అతనివెంట రాకుండా ఉండడానికి ఒప్పుకోలేదు. దీంతో చేసేదేం లేక ఇక్బాల్ కూతురిని బండిమీద ఎక్కించుకుని వెళ్లాడు. ఆ తరువాత ఈ దారుణానికి ఒడి గట్టాడు. శ్రీనగర్ లోని లోలాబ్ ప్రాంతంలోని ఖుర్హామా గ్రామంలోని తన ఇంటి నుండి ఇక్బాల్ బయలుదేరినప్పుడు, నలుగురు పిల్లల్లో ఒకరైన అతని కుమార్తె ఇక్బాల్ వెంటపడి, తిరిగి వెళ్లడానికి నిరాకరించిందని ఒక అధికారి తెలిపారు.

ఇక్బాల్ 45 నిమిషాల పాటు ఆమెను తనతో రావద్దని ఒప్పించడానికి ప్రయత్నించాడు. చాక్లెట్లు కొనుక్కోమని రూ.10 ఇచ్చాడు. కానీ ఆమె తిరిగి వెళ్ళడానికి నిరాకరించింది. తాను ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రదేశానికి చేరుకున్న తరువాత కూతురి ముందు ఎలా ఆత్మహత్య చేసుకోవాలన్న సందిగ్థంలో పడ్డాడు. తన ప్లాన్ కు కూతురు అడ్డు వస్తుందని కోపానికి వచ్చాడు. కోపంతో, ఆమెను గొంతు నులిమి.. ఆ తరువాత తన దగ్గరున్న కత్తితో గొంతు కోశాడు. దీంతో బాలిక చనిపోయింది" అని కుప్వారాలోని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ యోగుల్ మన్హాస్ చెప్పారు. .

ఆ తరువాత మృతదేహాన్ని కట్టెలు నిల్వ చేసే షెడ్‌లో పడేశాడు. కూతురిని హత్య చేసిన కొన్ని గంటల తర్వాత ఇక్బాల్ ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకుని ఇంటికి వెళ్లాడు. బాలిక గురించి కుటుంబ సభ్యులు అడగ్గా, ఆమె తనతో పాటు రాలేదన్నాడు. కనీసం నలుగురు వ్యక్తులు ఇక్బాల్‌తో పాటు అమ్మాయిని చూసినట్లు పోలీసులు తెలిపారు.

కూతురిని చంపిన తర్వాత, అతను ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నాడు. ఇంటికి వెళ్లాడు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు నిలదీయడంతో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ రిపోర్టు చేయడానికి వెళ్లాడు. కానీ అతను పోలీసు స్టేషన్ నుండి తిరిగి వచ్చే సమయానికి, కుటుంబ సభ్యులు, బంధువులు కట్టెల నిల్వ షెడ్ నుండి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.. అని పోలీసులు చెప్పారు. తండ్రి చేతిలో అకారణంగా హతమైన ఆ చిన్నారి అంత్యక్రియలకు వేలాది మంది తరలివచ్చారు. మహ్మద్ ఇక్బాల్ ఖతానాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.