ఆడపిల్లలపై దారుణాలు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రతీ నిముషం దేశంలో ఏదో ఒక చోట అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కన్నతండ్రులే కర్కశంగా కాటేస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ జరిగిన ఓ ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. 

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లో ఓ కన్నతండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి.. పైశాచికత్వానికి ఒడిగట్టాడు. కంటిపాపలా... చూసుకోవాల్సింది పోయి.. విషనాగులా కాటేశాడు. అత్యంత దారుణమైన.. హేయమైన.. పాశవిక చర్యకు ఒడిగట్టాడు. కూతుర్ని చంపి... ఆమె మృతదేహంతో తన కామవాంఛ తీర్చుకున్నాడు. సభ్య సమాజం కలలో కూడా ఊహించని అత్యంత భయంకరమైన ఘటన ఇది. 

Madhya Pradesh గునా జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న కుమార్తె(14)ను హత్య చేసిన ఓ తండ్రి అంతటితో ఆగకుండా ఆమె dead body మీద molestationకి పాల్పడ్డాడు. బాలికను అడవిలోకి తీసుకెళ్లి ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలిక మీద అఘాయిత్యం చేసిన ఆ వ్యక్తి.. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు తన కుమార్తె missing అని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక బంధువులను, ఇరుగుపొరుు వారిని విచారించారు. బాలిక చివరగా తండ్రితోనే కనిపించిందని అందరూ చెప్పారు. పోలీసులకు అనుమానం వచ్చి నిందితుడిని తమదైన శైలిలో విచారించగా.. నిజం అంగీకరించాడు.

ఇదిలా ఉండగా, ఈ యేడాది జనవరి 4న ఇలాంటి దారుణమైన ఘటనే రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ లో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అత్యంత పాశవికంగా వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునే కీచకపర్వానికి తెరతీశారు. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారయత్నం చేసి, హత మార్చడమే కాకుండా.. అనంతరం బాలిక మృతదేహంపై కూడా అత్యాచారం కొనసాగించిన దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బుండీ పట్టణంలో వెలుగుచూసింది.

గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన తప్పిపోయిన పదహారేళ్ల బాలిక మృతదేహమై కనిపించింది. పదహారేళ్ల బాలిక శవ పరీక్ష నివేదికలో దుండగులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. అంతేకాదు పోస్టుమార్టం చేసిన వైద్యులు ఓ భయంకర నిజాన్ని తెలుసుకుని షాక్ కు గురయ్యారు. ఆమె మీద అత్యాచార యత్నం చేసి, చంపేయడమే కాకుండా ఆమె మరణించిన తర్వాత కూడా బాలిక మృతదేహంపై నిందితులు అత్యాచారం కొనసాగించారని పోస్టుమార్టంలో తేలింది. 

వివరాల్లోకి వెడితే.. బుండి పట్టణ శివార్లలోని పొలాల్లో ఓ పదహారేళ్ళ వయసు గల బాలిక మేకలను మేపేందుకు వెళ్లింది. ఆ తరువాత అదృశ్యమైంది. ఆ బాలికను అపహరించిన ముగ్గురు కామాంధులు.. గిరిజన బాలికపై సామూహిక అత్యాచార యత్నం చేయగా, ఆమె ప్రతిఘటించడంతో వారు ఆమె గొంతు నులిమి చంపేశారు. ఆ తరువాత అంతటితో ఆగకుండా ఆమె శవం మీద కూడా అత్యాచారానికి తెగబడ్డారు. 

శవ పరీక్షలో బాలిక ప్రైవేటు భాగాల్లో 30కి పైగా గాయాలయ్యాయని తేలింది. నిందితులు ఆమె శరీరంపై గీతలు వేశారు. బాలికపై అత్యాచారం చేయడానికి ముందు నిందితులు ఆమెను దుపట్టాతో కట్టేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ‘నా జీవితంలో ఇంత దారుణమైన సంఘటన చూడలేదు. బుండీ బార్ అసోసియేషన్ సభ్యులు కూడా తాము నిందితుల తరపున కోర్టులో వాదించబోమని ప్రకటించారు’ అని బుండి జిల్లా ఎస్పీ జై యాదవ్ చెప్పారు.