తనతో రానందని స్క్రూడ్రైవర్‌తో భార్యను చంపి.. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని...
జార్ఖండ్‌లో ఓ వ్యక్తి తన భార్యను స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి అదుపు నుంచి తప్పించుకుని పారిపోయాడు.

జార్ఖండ్ : జార్ఖండ్‌లోని పాకూర్‌లో మంగళవారం ఓ వ్యక్తి తన భార్యను స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపాడు. హత్య జరిగిన మూడు గంటల తర్వాత ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసు కస్టడీ నుంచి అతను తప్పించుకున్నాడు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.
అతని కోసం వేట కొనసాగుతుండగా, పాకూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హెచ్.పి. జనార్దన్ ఐదుగురు పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిందితుడు పారిపోవడానికి కారణమైన ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. స్టేషన్‌లో ఉన్న ఇద్దరు వాచ్‌మెన్‌లను కూడా సస్పెండ్ చేసినట్లు ఎస్పీ జనార్దన్ తెలిపారు.
ప్రేమను తిరస్కరించిందని.. జూనియర్ గొంతుకోసిన ఇంజనీరింగ్ విద్యార్థి.. అరెస్ట్...
నిందితుడు కబీరుల్ షేక్ రెండు నెలల క్రితం 19 ఏళ్ల బీబీని వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం తన అత్తమామల ఇంట్లో కొంతకాలం గడిపిన తరువాత, బీబీ తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. మంగళవారం, కబీరుల్ బీబీ స్వగ్రామాన్ని వచ్చాడు. తనతో ఇంటికి తిరిగి రావాలని ఆమెను కోరాడు. ఆమె నిరాకరించడంతో ఆమెతో గొడవకు దిగి స్క్రూడ్రైవర్‌తో మెడపై పొడిచాడు. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనపై స్థానిక గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి.. మూడు గంటల్లోనే కబీరుల్ షేక్‌ను అరెస్టు చేశారు. అయితే కస్టడీలో ఉండగా నిందితుడు శారీరక అనారోగ్యంతో ఉన్నట్లు నటించాడు. అధికారులు ఆస్పత్రికి తరలించే పనిలో ఉండగా.. తప్పించుకుని పారిపోయాడు. నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు యత్నిస్తుండగా విచారణ కొనసాగుతోంది.