Asianet News TeluguAsianet News Telugu

మంచూరియా తినలేదని మనవడి ఘాతుకం.. అమ్మమ్మను కొట్టి చంపి, శవాన్ని గోడలో పూడ్చి పరార్.. ఆరేళ్ల తరువాత...

తాను తెచ్చిన మంచూరియా తినకుండా విసిరికొట్టిందని కోపానికి వచ్చిన ఓ మనవడు అమ్మమ్మను దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత శవాన్ని గోడలో పూడ్చి, పారిపోయాడు. 

man killed grandmother over Manchuria in Bangalore
Author
First Published Oct 8, 2022, 8:15 AM IST

బెంగళూరు : అమ్మమ్మ కోసం మనవడు గోబీ మంచూరియా తీసుకువచ్చాడు. అది తినడానికి ఆమె నిరాకరించింది. తనకిష్టం లేదంటూ విసిరికొట్టింది. దీంతో కోపానికి వచ్చిన యువకుడు ఆమెను కర్రతో కొట్టాడు. ఆ దెబ్బలకు అమ్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత శవాన్ని గోడలో పెట్టి సిమెంట్ వేసి పారిపోయాడు మనవడు. ఈ ఘటన జరిగిన ఆరేళ్ల తర్వాత  మనవడిని, అతని తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగర పరిధి కెంగేరి ఉపనగరలో శాంతకుమారి (69), తన కుమార్తె శశికళ (46), మనవడు సంజయ్ (26)లతో కలిసి ఉండేవారు.

శాంతకుమారి అతి శుభ్రత పాటించేది. ఓసిడి ఉంది. సంజయ్ బాగా చదివేవాడు. పదో తరగతి, ఇంటర్మీడియట్లో 90 శాతానికి పైగా  మార్కులు సాధించాడు. ఏరోనాటికల్ ఇంజినీరింగ్లో చేరాడు.  2016 ఆగస్టులో తన అమ్మకోసం గోబీ మంచూరియా పార్సిల్ తీసుకువచ్చాడు. దాన్ని శాంతకుమారి ఇచ్చాడు. అతిశుభ్రత పాటించే శాంతకుమారికి అది నచ్చలేదు. ఆమె ఆ పొట్లాన్ని మనవడి పైకి విసిరికొట్టింది. అలా చేయడంతో సంజయ్ కోపంతో ఊగిపోయాడు. రాగిసంకటి కలిపే కర్రతో శాంతకుమారి కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. 

విషాదం : మహారాష్ట్రలో బస్సులో చెలరేగిన మంటలు.. ఎనిమిదిమంది సజీవదహనం...

ఈ విషయం పోలీసులకు చెబుదామని తల్లి శశికళ తన కుమారుడికి చెప్పగా.. తనను అరెస్టు చేసి జైలులో పెడతారని, నువ్వు ఒంటరి అయిపోతావ్ అని తల్లిని బెదిరించాడు. దాంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. అయితే, మృతదేహాన్ని బయటకు తీసుకు వెళ్లడం కష్టమవుతుందని భావించి.. కుంబళగోడులో ఉంటున్న నందీష్ అనే స్నేహితుడికి ఫోన్ చేసి సంజయ్ ఇంటికి పిలిపించుకున్నాడు.  ముగ్గురూ కలిసి శవాన్ని ఇంట్లోని బీరువాలో ఉంచారు. దుర్వాసన రాకుండా శవానికి రసాయనాలు, సుగంధ ద్రవ్యాలు పూశారు. ఆ తర్వాత ఇంట్లో గోడకు రంధ్రం చేసి మృతదేహాన్ని అందులో ఉంచి ప్లాస్టరింగ్ చేసి రంగులు వేశారు. 

హత్య జరిగిన మూడు నెలల తర్వాత తాము ఊరికి వెళ్లి వస్తామని ఇంటి యజమానికి చెప్పి తల్లి, కుమారుడు వెళ్లిపోయారు. వారు తిరిగి రాకపోవడంతో ఇంటికి మరమ్మతులు చేయించేందుకు 2017 మే 7న తాళాలు పగలగొట్టిన ఇంటి యజమాని.. లోపలికి వెళ్లిచూడగా శాంతకుమారిని పూడ్చిపెట్టిన గోడకు, చీరపై రక్తం మరకలు కనిపించాయి. ఇంట్లో పోలీసులు సోదా చేయగా.. సంజయ్ వదిలి వెళ్లిన ఫోన్ కనిపించింది. కాల్ డేటా ఆధారంగా నందీశ్ ను అరెస్టు చేశారు.

అతనిచ్చిన సమాచారంతో గోడను తవ్వి శవాన్ని బయటకు తీశారు. ఇంట్లో నుంచి పరారైన శశికళ, సంజయ్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో  లో ఉన్నారు. ఒక హోటల్ లో సంజయ్ సప్లయర్గా, శశికళ అంట్లు కడిగే పనిలో చేరారు. మహారాష్ట్రకు వెడుతున్నామని వారి బంధువులు, స్నేహితులకు చెప్పిన మాట ఆధారంగా పలు పట్టణాల్లో గాలించి చివరికి నిందితులను అరెస్టు చేశామని ఇన్స్పెక్టర్ వసంత్ తెలిపారు.  శుక్రవారం నిందితులను బెంగళూరు తీసుకువచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios