నేటి పిల్లల్లో సహనం బొత్తిగా లేకుండా పోతోంది. తాము కోరుకున్నది దక్కకపోతే ఎంతకైనా తెగించేందుకు వారు వెనుకాడటం లేదు. దీపావళీ షాపింగ్‌కు తీసుకెళ్లలేదని ఓ కుర్రాడు పక్కింటి వ్యక్తిని దారుణంగా పొడిచి చంపాడు..

దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురికి చెందిన దీపక్, యోగేశ్ పక్కపక్క ఇళ్లలో ఉంటారు. ఈ క్రమంలో దీపక్ దీపావళీకి టపాసులు, ఇతర వస్తువులు కొనేందుకు మార్కెట్‌కు బయలుదేరాడు. ఇంతలో యోగేశ్ వెంటనే తాను వస్తానని మారాం చేసి.. గొడవపడ్డాడు.

దీపక్ అందుకు ససేమిరా అనడంతో యోగేశ్ అక్కడి నుంచి వెళ్లపోయాడు.అయితే దీపక్‌పై కక్ష పెంచుకున్న యోగేశ్ అతన్ని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగిన సమయం కోసం వేచి చూస్తుండగా గురువారం రాత్రి 11.40 సమయంలో దీపక్‌ను కత్తితో పొడిచాడు.

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతన్ని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. హస్పిటల్‌లో చికిత్స పొందుతూ దీపక్ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యోగేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.